News November 15, 2024
ప్రకాశం: అక్రమ మద్యం విక్రయాలపై తనిఖీలు

ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అక్రమ మద్యం విక్రయాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా బెల్ట్ షాపులు, బార్లు, రెస్టారెంట్లు & దాబాలపై శుక్రవారం దాడులు నిర్వహించారు. లైసెన్స్ లేని దుకాణదారులు, అక్రమ మద్యం అమ్మేవారి వివరాలు సేకరించారు.
Similar News
News December 10, 2025
ప్రకాశం జిల్లాలో సబ్సిడీతో పెట్రోల్.!

ప్రకాశం జిల్లాలో మూడు చక్రాల మోటార్ వాహనాలు కలిగిన అర్హులైన దివ్యాంగులకు పెట్రోల్ సబ్సిడీతో మంజూరు చేయనున్నట్లు సంబంధిత శాఖ సహాయ సంచాలకులు సువార్త తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో బుధవారం ఆమె మాట్లాడుతూ.. 2025 – 26 ఆర్థిక సంవత్సరానికి పెట్రోల్ సబ్సిడీ మంజూరయిందన్నారు. పెట్రోల్ సబ్సిడీ పొందేందుకు ఆసక్తి గల దివ్యాంగ అభ్యర్థులు కార్యాలయంలో అందించే దరఖాస్తులను 17లోగా అందించాలని ఆమె తెలిపారు.
News December 10, 2025
ప్రకాశం వాసులకు CM గుడ్ న్యూస్.!

ప్రకాశం జిల్లాకు సంబంధించి CM కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో ఉద్యానవన పంటలు సాగుచేసే రైతన్నలకు శుభవార్తగా చెప్పవచ్చు. ఉద్యానపంటలపై సమీక్షించిన సీఎం, జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు, చెరువులను పూర్తి చేయడం ద్వారా పంటలకు నీరు అందించవచ్చని అధికారులకు సూచించారు. పోలవరం -నల్లమల సాగర్ ప్రాజెక్టుల అనుసంధానంతో ప్రకాశం, నెల్లూరు జిల్లాలో కొత్తగా 7లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించనున్నారు.
News December 10, 2025
చీమకుర్తిలో పిల్లలతో కలిసి భోజనం చేసిన కలెక్టర్

చీమకుర్తిలోని ప్రభుత్వం ఉన్నత పాఠశాలలో జరుగుతున్న మధ్యాహ్న భోజనాన్ని కలెక్టర్ రాజాబాబు, MLA విజయ్ కుమార్ బుధవారం మధ్యాహ్నం పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. తదుపరి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో ఎంఈఓలు శివాజీ, ఎల్వీ నరసింహారావు, మండల టీడీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


