News June 11, 2024
ప్రకాశం: అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన కారు

అదుపుతప్పి కారు ఫెన్సింగ్ ఢీకొట్టి గుంతలో పడింది. ఈ సంఘటన జాతీయరహదారిపై ఉలవపాడు దక్షిణ బైపాస్ సమీపంలో సోమవారం జరిగింది. ఒంగోలు సుజాతనగర్ చెందిన కామేష్ తన భార్యతో కలసి ఒంగోలు నుంచి కావలి వెళుతున్నారు. ఉలవపాడు వద్దకు వచ్చేసరికి మలుపు వద్ద ఫెన్సింగ్ ఢీకొట్టి గుంతలో పడిపోయింది. ఇద్దరికి ఎలాంటి గాయాలు కాలేదు. వేరే వాహనంలో వెళ్లిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News September 19, 2025
తెరపైకి బూచేపల్లి.. అసలేం జరుగుతోంది?

మద్యం కుంభకోణం కేసు గురించి ప్రకాశం జిల్లాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఒంగోలు వైసీపీ MP అభ్యర్థిగా పోటీచేసిన చెవిరెడ్డిని ఈ కేసులో అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. దర్శి MLA బూచేపల్లి పేరు ఈ కేసులో వినిపిస్తోంది. మద్యం కుంభకోణంలో ఆయన ప్రమేయం ఉదంటూ సిట్ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. డబ్బులు బూచేపల్లికి చేరాయని ఆరోపిస్తుండగా.. నిజంగా ఆయన పాత్ర ఉందా? లేక కావాలనే చేర్చారా? అనేది తేలాల్సి ఉంది.
News September 19, 2025
నేడు ప్రకాశం జిల్లాలో పిడుగులతో కూడిన వర్షం

ప్రకాశం జిల్లాలో శుక్రవారం పిడుగులతో కూడిన భారీ వర్ష సూచన ఉన్నట్లు ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ గురువారం ప్రకటన విడుదల చేసింది. జిల్లాకు వరుసగా మూడు రోజులపాటు భారీ వర్షసూచన ఉన్నట్లు వాతావరణ శాఖ ఇప్పటికే అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు జాగ్రత్త వహించాలని అధికారులు సూచించారు.
News September 19, 2025
IT కోర్ సెంటర్ కంట్రోల్ రూమ్ను సందర్శించిన SP

జిల్లా పోలీస్ కార్యాలయంలో SP హర్షవర్ధన్ రాజు గురువారం IT కోర్ సెంటర్, కంట్రోల్ రూమ్ సెంటర్లను సందర్శించారు. సిబ్బంది పని తీరు, విధులపై ఆరా తీశారు. CCTNS, CDR, సైబర్ క్రైమ్ అప్డేట్స్, అప్లికేషన్లపై సిబ్బందితో చర్చించారు. పలు ఫైల్స్ పరిశీలించారు. పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల దర్యాప్తునకు ఉపయోగపడే ఆధారాలను త్వరితగతిన అందించాలన్నారు.