News May 21, 2024
ప్రకాశం: అన్నా పందెం ఎంత.?

ఒకవైపు ఐపీఎల్, మరో వైపు ఏపీలో ఎన్నికల ఫలితాలు ఈ రెండింటిపై జిల్లాలో భారీగా బెట్టింగ్ జరుగుతున్నట్లు సమాచారం. ఎన్నడూ లేనంతగా ఈ సారి ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా సీఎం ఎవరు అవుతారు, వచ్చే మోజార్టీ ఎంత, ఎమ్మెల్యే, ఎంపీగా ఎవరు గెలుస్తారు..? ఇలా పలు అంశాలపై బెట్టింగ్ రాయుళ్లు పందేలు నిర్వహిస్తున్నారు. ధనమే కాకుండా ఇళ్లులు, భూములు సైతం పందేల్లో పెడుతున్నారు.
Similar News
News November 29, 2025
కందుకూరు, అద్దంకి డివిజన్‌లో కలిసే మండలాలు ఇవే.!

ప్రకాశం జిల్లాలోని కొన్ని డివిజన్లలో మార్పులు జరగనున్నాయి. ప్రధానంగా కందుకూరు డివిజన్‌లోకి లింగసముద్రం, గుడ్లూరు, ఉలవపాడు, వలేటివారిపాలెం వచ్చి కలవనున్నాయి. కనిగిరి డివిజన్‌లో ఉన్న మర్రిపూడి, పొన్నలూరు మండలాలు కందుకూరు డివిజన్‌లో కలవనున్నాయి. అద్దంకి పరిధిలోకి బల్లికురవ, సంతమాగులూరు, జె.పంగులూరు, కొరిశపాడు- ఒంగోలు నుంచి ముండ్లమూరు, తాళ్ళూరు, కనిగిరి నుంచి దర్శి, దొనకొండ, కురిచేడు రానున్నాయి.
News November 28, 2025
అదనపు డబ్బులు వసూలు చేస్తే చర్యలు: JC

కేంద్ర ప్రభుత్వం ఉజ్వల పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్ లేని పేదలకు గ్యాస్ కనెక్షన్, మొదటి గ్యాస్ సిలిండర్ను సైతం ఉచితంగా అందజేయడం జరుగుతుందని JC గోపాలకృష్ణ అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం దీపం కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో మాట్లాడుతూ.. గ్యాస్ డెలివరీ చేసే సమయంలో అదనపు డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, బాధ్యులైనవారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
News November 28, 2025
ప్రకాశం: పొగ మంచు కురుస్తోంది.. జాగ్రత్త.!

ప్రస్తుతం జాతీయ రహదారుల్లో అధికంగా పొగమంచు కురిసే అవకాశం ఉందని, వాహనదారులు తగిన జాగ్రత్తలు పాటించాలని ప్రకాశం జిల్లా పోలీసులు సూచించారు. ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయం సోషల్ మీడియా ద్వారా వాహనదారులు, డ్రైవర్లకు శుక్రవారం పలు సూచనలు జారీ చేసింది. హైవేల్లో రాకపోకలు సాగించే వాహనాలకు కాస్త గ్యాప్తో ప్రయాణించాలన్నారు. అలాగే ట్రాఫిక్ జామ్ సమయాలలో కూడా వాహనాల రద్దీ నేపథ్యంలో జాగ్రత్త వహించాలన్నారు.


