News February 3, 2026
ప్రకాశం: అరుదైన అవార్డు అందుకున్న డీడీ డా.జగత్ శ్రీనివాస్

ప్రకాశం జిల్లా పశు వైద్య ఆరోగ్యశాఖలో డిప్యూటీ డైరెక్టర్‌గా పని చేస్తున్న డాక్టర్ జగత్ శ్రీనివాస్‌కు అరుదైన అవార్డు వరించింది. జాతీయస్థాయిలో అందించే డాక్టర్ సీఎం సింగ్ సుశ్రుత గౌరవ రత్న సమ్మాన్ 2025 అవార్డులకు ఏపీ నుంచి ఇద్దరు ఎంపిక కాగా.. వారిలో డీడీ జగత్ శ్రీనివాస్ ఒకరు. ఈ సందర్భంగా ఏపీ పశుసంవర్ధక శాఖ రాష్ట్ర డైరెక్టర్ దామోదర్ నాయుడు ఈయనకు సర్టిఫికెట్లను బహుకరించి ఘనంగా సన్మానించారు.
Similar News
News April 20, 2026
బల్లికురవ: రోడ్డు ప్రమాదం.. లారీ క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్

ప్రకాశం జిల్లాలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. బల్లికురవ మండలం రామాంజనేయపురం సమీపంలో ఈ ప్రమాదం జరగ్గా.. అద్దంకి నుంచి సంతమాగులూరు వైపు వెళ్తున్న తమిళనాడు లారీ డ్రైవర్ వాటర్ ట్యాంక్‌ను ఢీకొన్నాడు. ప్రమాదంలో లారీ డ్రైవర్ రెండు కాళ్లు క్యాబిన్లో ఇరుక్కుపోయాయి. హైవే సిబ్బంది అతి కష్టంమీద డ్రైవర్‌ను క్యాబిన్ నుంచి బయటకు తీశారు. అంబులెన్స్‌లో నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
News April 20, 2026
ప్రకాశం: ఇళ్ల నిర్మాణాలపై యుద్ధం ఎఫెక్ట్

ప్రకాశం జిల్లాలో కొత్త ఇళ్ల నిర్మాణంపై యుద్ధం ఎఫెక్ట్ కనిపిస్తోంది. వార్ ప్రారంభమయ్యాక ఒక్కసారిగా ధరలు పెరిగాయి. యుద్ధం ముందు టన్ను స్టీల్ రూ.55 వేలు ఉండగా.. ప్రస్తుతం రూ.75 వేలకుచేరింది. రూ.260 ఉండే సిమెంట్ రూ.300కు చేరడంతో ఇళ్లు కట్టుకునే వాళ్లకు భారంగా మారింది. సిమెంట్ బ్రాండ్లను బట్టి ఒక్కో బస్తాపై రూ.30 నుంచి రూ.40 వరకు పెరిగింది.
News April 20, 2026
భైరవకోనకు వెళ్తున్నారా..?

మార్కాపురం జిల్లా CSపురం మండల పరిధిలోని భైరవకోనకు చాలామంది భక్తులు వస్తుంటారు. ఈక్రమంలో ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. పామూరు నుంచి CSపురం మీదుగా భైరవకోనకు ప్రతి ఆదివారం బస్సు నడుపుతామని కందుకూరు డిపో అధికారులు ప్రకటించారు. పామూరులో ప్రతి ఆదివారం ఉదయం 8.30గంటలకు, 11.30గంటలకు బస్సు స్టార్ట్ అవుతుంది. ఇదే బస్సుల్లో తిరిగి పామూరు చేరుకోవచ్చు.
Share It.


