News October 8, 2024
ప్రకాశం: అర్జీల పరిష్కరం, ఎండార్స్మెంట్ తప్పనిసరి

గ్రీవెన్స్ అర్జీలను సకాలంలో పరిష్కరించడంతోపాటు తగిన విధంగా ఎండార్స్మెంట్ ఇవ్వడం కూడా ముఖ్యమని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ స్పష్టం చేశారు. ఒంగోలులోని ప్రకాశం భవనం నుంచి మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. గ్రీవెన్స్ అర్జీలను పరిష్కరించి ఎండార్స్మెంట్ ఇవ్వడంపై ప్రతి శుక్రవారం సాయంత్రం 5 గంటలకు రివ్యూ సమావేశం నిర్వహిస్తానని చెప్పారు.
Similar News
News November 25, 2025
మళ్లీ ప్రకాశంలోకి అద్దంకి నియోజకవర్గం?

బాపట్ల జిల్లాలోని అద్దంకి నియోజకవర్గం ప్రకాశంలోని కలవనున్నట్లు తెలుస్తోంది. గతంలో ప్రకాశం జిల్లాలో ఉన్న అద్దంకి పరిపాలన దృష్ట్యా బాపట్లలో చేర్చారు. ప్రస్తుతం జిల్లాల పునర్వవ్యవస్థీకరణలో భాగంగా అద్దంకిని ప్రకాశంలో కలిపి, రెవెన్యూ డివిజన్గా మార్చేందకు ఉపసంఘం ప్రతిపాదించింది. నిన్న అమరావతిలో జరిగిన సమీక్షలో ఈ నివేదికను సీఎం చంద్రబాబుకు అందించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం
News November 25, 2025
ప్రకాశం జిల్లా గురుకులాల్లో టీచర్ ఉద్యోగాలు.!

ప్రకాశం జిల్లా కో-ఆర్డినేటర్ జయ పార్ట్టైం టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించారు. చీమకుర్తి బాలికల గురుకులాల్లో JL బోటనీ, మార్కాపురం బాలికల గురుకులాల్లో JL మ్యాథమెటిక్స్, కొండేపిలో TGT ఫిజికల్ సైన్స్ విభాగాలకు దరఖాస్తులు అందుకుంటున్నారు. డిసెంబర్ ఒకటిలోగా చీమకుర్తి గురుకులంలో దరఖాస్తులు అందజేయాలని తెలిపారు. 2వతేదీ 11 AMకి చీమకుర్తి గురుకులంలో డెమో క్లాస్ ఉంటుందన్నారు.
News November 25, 2025
ప్రకాశం SP మీకోసంకు 63 ఫిర్యాదులు.!

ఒంగోలు SP కార్యాలయంలో సోమవారం నిర్వహించిన SP మీకోసం కార్యక్రమానికి 63 ఫిర్యాదులు అందాయి. జిల్లా ఇన్ఛార్జ్ SP ఉమామహేశ్వర ఆదేశాలతో మహిళా పోలీస్ స్టేషన్ DSP రమణకుమార్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి సమస్యలను పోలీసు అధికారులు తెలుసుకున్నారు.


