News April 25, 2024
ప్రకాశం: ఆఖరి క్షణంలో అభ్యర్థులు మార్పు

ప్రకాశం జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో అనూహ్యంగా అభ్యర్థుల మార్పు చోటు చేసుకుంది. ఒంగోలుకు తొలుత బీఆర్ గౌస్ పేరు ప్రకటించగా ఆయన ప్రచారం కూడా మొదలు పెట్టారు. మూడో జాబితాలో కొత్తపట్నం మండలానికి చెందిన దాసరి నాగలక్ష్మి ఖరారయింది. కొండపి సీటు తొలుత శ్రీపతి సతీశ్‌కు ఇచ్చారు. ఇప్పుడు పసుమర్తి సుధాకర్‌కు కేటాయించారు. అటు కనిగిరి సీటు కదిరి భవానికి కేటాయించగా ఇప్పుడు సుబ్బారెడ్డి పేరు తెరపైకి వచ్చింది.
Similar News
News January 22, 2026
మార్కాపురం జిల్లా.. మొదటిసారి రథసప్తమి వేడుకలు

మార్కాపురం జిల్లా ఏర్పడిన అనంతరం మొదటిసారి చెన్నకేశవ స్వామి రథసప్తమి వేడుకలు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో నూతన ఉత్తేజంతో ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఈవో శ్రీనివాసరెడ్డి తెలిపారు. జనవరి 25వ తేదీ ఉదయం నుంచి రాత్రి వరకు జరుగుతుందన్నారు. సూర్యప్రభ వాహనం, శేష వాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనం, చక్ర స్నానం, కల్పవృక్ష వాహనం, రజిత రథోత్సవం, చంద్రప్రభ వాహనాలపై చెన్నకేశవ స్వామి దర్శనమిస్తారన్నారు.
News January 22, 2026
ప్రకాశం: కందికి రూ.8వేలు

కంది కొనుగోలుకు రూ.8 వేలుగా ధరను ప్రభుత్వం నిర్ణయించిందని బేస్తవారిపేట మండల వ్యవసాయ అధికారి షేక్ అబ్దుల్ రఫీక్ తెలిపారు. ఈ విషయాన్ని మండలంలో నిర్వహిస్తున్న పొలం పిలుస్తోంది కార్యక్రమంలో రైతులకు వివరిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. రైతులందరూ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకోవాలని సూచించారు. కంది పైరు వేసిన ప్రతి రైతు వారికి సంబంధించిన RSK సిబ్బందిని సంప్రదించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు.
News January 21, 2026
మార్కాపురం జిల్లాలో దారుణ హత్య.!

మార్కాపురం జిల్లాలో బుధవారం రాత్రి దారుణ హత్య జరిగింది. పెద్దారవీడు మండలం బద్వీడు చెర్లోపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. లాలూ అనే వ్యక్తిని భార్య, బావమరిది కత్తులతో పొడిచి చంపినట్లు సమాచారం. హత్య చేసిన అనంతరం రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పెద్దారవీడు పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


