News February 25, 2025

ప్రకాశం: ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశ పరీక్ష

image

2025-26 విద్యా సంవత్సరానికి జిల్లాలోని ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతిలో చేరటానికి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లుగా డీఈఓ కిరణ్ సోమవారం తెలిపారు. ఏప్రిల్ 20వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుంచి, 12 గంటల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు. కావున ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతిలో చేరటానికి ఆసక్తి కనబరిచే విద్యార్థులు ఆన్లైన్‌లో మార్చి 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

Similar News

News December 4, 2025

ప్రకాశంలో జోరు తగ్గిన మద్యం.. లెక్కలివే!

image

ప్రకాశంలో నవంబర్‌కు సంబంధించి మద్యం కొనుగోళ్ల జోరు తగ్గింది. అధికారుల వద్ద ఉన్న లెక్కల మేరకు (కోట్లల్లో).. ఈ ఏడాది జనవరిలో రూ. 105.69, ఫిబ్రవరి రూ. 106.28, మార్చి రూ. 117.41, ఏప్రిల్ రూ.66.5, మే రూ.117.41, జూన్ రూ.110.26, జులై రూ.105.37, ఆగస్ట్ రూ.118.62, సెప్టెంబర్ రూ.111.52, అక్టోబర్ రూ.95.38, నవంబర్ రూ. 86.75 కోట్లల్లో ఆదాయం దక్కింది. డిసెంబర్‌లో ఆదాయం అధికంగా రావచ్చని అధికారుల అంచనా.

News December 3, 2025

మద్దిపాడులో వసతి గృహాలను తనిఖీ చేసిన ప్రకాశం కలెక్టర్

image

మద్దిపాడులోని SC, ST, BC సంక్షేమ వసతి గృహాలను జిల్లా కలెక్టర్ రాజాబాబు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్ వద్ద విద్యార్థులకు కల్పించిన సౌకర్యాల గురించి కలెక్టర్ ఆరా తీశారు. విద్యార్థుల హాజరు శాతం, పలు రికార్డులను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. సంక్షేమ వసతి గృహాల్లో ఉన్న విద్యార్థులకు సదుపాయాలు కల్పించడంలో అశ్రద్ధవహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News December 3, 2025

ప్రకాశం జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు

image

ప్రకాశం జిల్లాలోని వివిధ ఉన్నత, ప్రైమరీ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టుల భర్తీకై కాంట్రాక్టు పద్ధతిన అకడమిక్ ఇన్‌స్పెక్టర్స్‌ను నియమిస్తున్నట్లు DEO కిరణ్ కుమార్ తెలిపారు. బుధవారం ఒంగోలులోని డీఈఓ కార్యాలయం నుంచి ఆయన ప్రకటన విడుదల చేశారు. అర్హులైనవారు ఈనెల 5లోగా దరఖాస్తులను మీ పరిధిలోని MEOలకు అందజేయాలన్నారు. వివరాలకు స్థానిక MEOలను సంప్రదించాలన్నారు.