News June 22, 2024
ప్రకాశం: ఆయనొక్కరే ఇంగ్లిష్‌లో.. మిగిలిన వాళ్లంతా తెలుగులో

నిన్న ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంలో ఆసక్తికర సన్నివేశం జరిగింది. ప్రకాశం జిల్లా నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేల్లో సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయ్ కుమార్ ఒక్కరే ఇంగ్లిష్‌లో ప్రమాణం చేశారు. మిగతా 11 మంది తెలుగులో చేశారు. వీరందరితో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి దైవసాక్షిగా ప్రమాణం చేయించారు.
Similar News
News February 24, 2026
రేపు మార్కాపురం జిల్లాకు CM.. షెడ్యూల్ ఇదే.!

CM చంద్రబాబు బుధవారం మార్కాపురం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన పర్యటన షెడ్యూల్ CMO అధికారులు విడుదల చేశారు. రేపు మధ్యాహ్నం 12:50కి దోర్నాలలోని వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ పనులకు శంకుస్థాపన చేసి, పనులను పరిశీలించి మధ్యాహ్నం 2 గంటల వరకు అక్కడే ఉంటారు. మధ్యాహ్నం 2:30కి మార్కాపురంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం 4:40కి తిరిగి వెలగపూడికి బయలుదేరుతారు.
News February 24, 2026
ఒంగోలు: ‘మీకోసం’కు 75 ఫిర్యాదులు

ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలనే లక్ష్యంగా సోమవారం ఒంగోలులోని పోలీస్ కార్యాలయంలో మీకోసం కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను పోలీస్ అధికారులకు ప్రత్యక్షంగా వివరించారు. ప్రతి ఫిర్యాదుదారుతో అధికారులు ముఖాముఖీ మాట్లాడి వారి సమస్యల వివరాలను తెలుసుకున్నారు. మీకోసం కార్యక్రమానికి 75 ఫిర్యాదులు అందాయని త్వరగా పరిష్కరించాలన్నారు.