News December 16, 2024

ప్రకాశం: ఆ గేటు మరమ్మతులకు ఇతని సాయం తీసుకుంటారా.?

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని <<14846862>>రాళ్లపాడు ప్రాజెక్ట్<<>> కుడి కాలువ గేటు మరమ్మతులకు గురైన విషయం తెలిసిందే. అధికారులు, MLA ర్రాతికి రాత్రే స్పందించి 10 రోజులుగా ప్రత్యేక బృందాలతో పనులు చేపట్టినా ప్రయోజనం లేదు. <<14890737>>క్రెయిన్<<>> సాయంతో పనులు చేపట్టినా సమస్య కొలిక్కిరాలేదు. దీంతో తుంగభద్ర, ప్రకాశం బ్యారేజీల సమస్యలను సులువుగా తీర్చిన ఇంజినీర్ కన్నయ్య నాయుడి సలహాలు తీసుకుంటారా అన్నది తెలియాల్సిఉంది.

Similar News

News January 13, 2025

పర్చూరులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్.. మరొకరు మృతి

image

ఇటీవల పర్చూరులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి సజీవ దహనమైన అక్కాచెల్లెళ్ల గురించి మరువక ముందే వారి కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. కూతుళ్లను కాపాడుకునే ప్రయత్నంలో కాలిపోయి గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న తల్లి దాసరి లక్ష్మీరాజ్యం కూడా తనువు చాలించింది. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పర్చూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News January 13, 2025

గుడ్లూరు వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

image

గుడ్లూరు మండలం చేవూరు జాతీయ రహదారిపై సోమవారం బైకు, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయినట్లు స్థానికులు తెలిపారు. చెన్నై నుంచి కరీంనగర్ వెళ్తున్న కారు చేవూరు వద్ద మోటర్ బైక్‌ను ఢీకొంది. బైక్‌పై ప్రయాణిస్తున్న వెంకటేశ్వర్లు, కారులో పయనిస్తున్న అధ్విక రాజ్ అనే పాప అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రులను కావలి వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News January 13, 2025

మార్కాపురం: దారణ హత్య.. హంతకులు ఎవరంటే?

image

మార్కాపురం మండలం కొత్తపల్లికి చెందిన సుబ్బలక్ష్మమ్మకు 30 ఏళ్ల క్రితం వెంకటేశ్వర్లతో వివాహమైంది. అదే గ్రామానికి చెందిన వెంకటనారాయణతో తన భార్య అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో వెంకటనారాయణను 2005వ సం”లో వెంకటేశ్వర్లు హత్య చేసి 9 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాడు. కాగా సుబ్బలక్ష్మమ్మ తన పద్ధతి మార్చుకోలేదనే అనుమానంతో వెంకటేశ్వర్లు తన ఇద్దరు తమ్ముళ్లతో కలిసి 4 రోజుల క్రితం భార్యను హత్య చేశాడు.