News December 24, 2024

ప్రకాశం: ఆ ప్రాంతంలోనే వరుస భూ ప్రకంపనలు

image

ప్రకాశం జిల్లాలో గత 3రోజులుగా వరుస భూ ప్రకంపనలు సంభవిస్తున్న విషయం తెలిసిందే. అందులోనూ దర్శి నియోజకవర్గంలోనే ఈ ప్రకంపనలు సంభవించడం గమనార్హం. 21వ తేదీన మొదటిగా ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో, 22న సింగన్నపాలెం, మారెళ్లలో, 23న తాళ్లూరు, విఠలాపురం, కొత్తపాలెం, ముండ్లమూరు, పసుపుగల్లు గ్రామాల్లో ప్రకంపనలు వచ్చాయి. ఇలా గత 3 రోజులుగా 7సార్లు భూ ప్రకంపనలు సంభవించడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

Similar News

News December 29, 2025

మార్కాపురం సరికొత్త జిల్లాలో.. మండలాలు ఇవేనా?

image

మార్కాపురం జిల్లాకు కొత్త ఏడాదిలో ముహూర్తం ఖరారైంది. గతంలో 21 మండలాలతో ఆమోదం తెలపగా.. దొనకొండ, కురిచేడు మండలాలను కలిపేందుకు సన్నాహాలు సాగుతున్నాయి. వైపాలెం, రాచర్ల, కొమరోలు, త్రిపురాంతకం, వెలిగండ్ల, పి.చెరువు, దోర్నాల, పెద్దారవీడు, హెచ్.యం పాడు, తర్లుపాడు, మార్కాపురం, పొదిలి, కొనకనమిట్ల, కనిగిరి, పీసీపల్లి, సీఎస్‌పురం, పామూరు, కంభం, అర్ధవీడు, కంభం, బి.పేట, దొనకొండ, కురిచేడు మండలాలు ఉండనున్నాయి.

News December 29, 2025

ప్రజల్లో విశ్వాసం పెంచాలి: ప్రకాశం కలెక్టర్

image

ప్రజల్లో విశ్వాసం పెంచడమే లక్ష్యంగా పోలీసులు పని చేయాలని కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఒంగోలులోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో సోమవారం నిర్వహిస్తున్న పోలీస్ శాఖ వార్షిక నేర సమీక్ష సమావేశంలో ఎస్పీ హర్షవర్ధన్‌రాజుతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నేరాల నియంత్రణతోపాటు సత్వర విచారణ, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. విచారణలో సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా ఉపయోగించాలన్నారు.

News December 29, 2025

ప్రకాశం: నేటి కార్యక్రమం రద్దు

image

పోలీసుల వార్షిక నేర సమీక్షా సమావేశం జరగనున్న దృష్ట్యా, ప్రకాశం జిల్లా పోలీస్ కార్యాలయంలో నేడు నిర్వహించవలసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి, ఒంగోలులోని ఎస్పీ కార్యాలయానికి సోమవారం మీకోసం ఫిర్యాదుల నిమిత్తం రావద్దని ఎస్పీ కోరారు.