News December 24, 2024

ప్రకాశం: ఆ ప్రాంతంలోనే వరుస భూ ప్రకంపనలు

image

ప్రకాశం జిల్లాలో గత 3రోజులుగా వరుస భూ ప్రకంపనలు సంభవిస్తున్న విషయం తెలిసిందే. అందులోనూ దర్శి నియోజకవర్గంలోనే ఈ ప్రకంపనలు సంభవించడం గమనార్హం. 21వ తేదీన మొదటిగా ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో, 22న సింగన్నపాలెం, మారెళ్లలో, 23న తాళ్లూరు, విఠలాపురం, కొత్తపాలెం, ముండ్లమూరు, పసుపుగల్లు గ్రామాల్లో ప్రకంపనలు వచ్చాయి. ఇలా గత 3 రోజులుగా 7సార్లు భూ ప్రకంపనలు సంభవించడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

Similar News

News January 21, 2025

PM అవార్డ్స్ కోసం ప్రతిపాదనలు పంపండి: ప్రకాశం కలెక్టర్

image

పీఎం అవార్డ్స్ కోసం తగిన ప్రతిపాదనలతో వివరాలను వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలపై మంగళవారం ప్రకాశం భవనంలో సంబంధిత అధికారులతో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 2022 ఏప్రిల్ నెల నుంచి 2024 డిసెంబరు నెలాఖరు వరకు వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించిన వివరాలతో సమగ్ర నివేదికలను రూపొందించాలని అధికారులకు ఆమె దిశానిర్దేశం చేశారు.

News January 21, 2025

అధికారులకు ప్రకాశం కలెక్టర్ కీలక సూచనలు

image

రెవెన్యూ సదస్సులలో వచ్చిన అర్జీల పరిష్కారం, రీ సర్వేపై క్షేత్రస్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. మంగళవారం ఆయా అంశాలపై డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెవెన్యూ సదస్సులను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిందన్నారు. ఈ సదస్సులలో వచ్చిన అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

News January 21, 2025

ప్రకాశం జిల్లా బీజీపీ నూతన అధ్యక్షుడిగా శ్రీనివాసరావు

image

 ప్రకాశం జిల్లా బీజేపీ నూతన అధ్యక్షులుగా సెగం శ్రీనివాస్ రావు నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ఒంగోలులో అధికారికంగా కమిటీ సభ్యులు ప్రకటన చేశారు. పార్టీ బలోపేతంపై ఫోకస్ చేస్తానని ఆయన పేర్కొన్నారు. తనకు పదవి వచ్చేందుకు సహకరించిన రాష్ట్ర నాయకులకు నూతన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.