News February 12, 2026
ప్రకాశం: ఆ 40 మందిలో మీ MLA ఉన్నారా..?

ఎమ్మెల్యేల సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సుమారు 40 మంది ఎమ్మెల్యేల పనితీరు ఆశాజనకంగా లేదని అసహనం వ్యక్తం చేశారు. ఈ జాబితాలో ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నట్లు సమాచారం. పనితీరు మార్చుకోని వారితో నేరుగా మాట్లాడతానని సీఎం వెల్లడించారు. మరి మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఆ 40 మందిలో మీ ఎమ్మెల్యే ఉన్నారని అనుకుంటున్నారా.. అయితే కామెంట్ చేయండి.
Similar News
News March 11, 2026
ప్రకాశం: ఆసుపత్రులలో జాబ్స్.. తుది జాబితా విడుదల..!

ప్రకాశం జిల్లా డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ పరిధిలోని ఆసుపత్రులలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి స్వీకరించిన దరఖాస్తుల ఫైనల్ మెరిట్ జాబితాను మంగళవారం జిల్లా కో ఆర్డినేటర్ విడుదల చేశారు. ఈ మేరకు ఆడియో మెట్రిటీషియన్, థియేటర్ అసిస్టెంట్, జనరల్ డ్యూటీ అటెండెంట్, పోస్టుమార్టం అసిస్టెంట్,తదితర పోస్టుల తుది జాబితాను (prakasam.ap.gov.in)వెబ్ సైట్‌లో పొందుపరిచినట్లు తెలిపారు. అభ్యర్థులు గమనించాలని కోరారు.
News March 10, 2026
కొండేపి: పదో తరగతి విద్యార్థుల్లో ధైర్యం నింపిన మంత్రి

పదో తరగతి పరీక్షల నేపథ్యంలో మంత్రి స్వామి మంగళవారం విద్యార్థులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన తన పదో తరగతి పరీక్షల అనుభవాలను పంచుకుంటూ విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థులు ఎటువంటి ఆందోళన చెందకుండా, ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరుకావాలని సూచించారు. ఒత్తిడిని జయించి ప్రశాంతంగా రాయాలని పలు కీలక సూచనలు చేశారు.
News March 10, 2026
మార్కాపురం మున్సిపాలిటీలో ఉద్యోగాల పేరిట రూ.కోటి టోకరా..?

మార్కాపురం మున్సిపాలిటీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఓ వ్యక్తి నమ్మబలికి రూ.కోటికి పైగా వసూలు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పారిశుద్ధ్య కార్మికులుగా చేర్పించడానికి ఒక్కొక్కరి వద్ద రూ.2 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలిసింది. గత ఏడాదిగా నియమకాలు లేకుండానే పనులు చేయించుకుంటున్నట్లు తెలిసింది. 15 నెలలు అవుతున్నా ఉద్యోగం రాకపోవడంతో తమ డబ్బులు వెనకకు ఇవ్వాలని బాధితులు అడగడంతో ఈ వ్యవహారం బయటపడింది.


