News February 28, 2025
ప్రకాశం: ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

ప్రకాశం జిల్లాలో మార్చి ఒకటో తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆర్ఐవో సైమన్ విక్టరీ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 67 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇందులో 5 సమస్యాత్మకమైన కేంద్రాలుగా గుర్తించామని.. అక్కడ ప్రత్యేక నిఘా ఉంచుతామన్నారు.
Similar News
News December 20, 2025
ఒంగోలులో రూ.40వేల వేతనంతో జాబ్స్..!

ఒంగోలులోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 23వ తేదీ ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రమాదేవి తెలిపారు. ఈ జాబ్ మేళాకు ప్రముఖ కంపెనీలు హాజరుకానున్నట్లు చెప్పారు. 10th నుంచి ఏదైనా డిగ్రీ చదివిన 18-35 ఏళ్లలోపు వయస్సు గలవారు అర్హులు. జీతం రూ.40వేల వరకు పొందే అవకాశం ఉందన్నారు.
News December 20, 2025
ప్రకాశం: మీకు ఈ కార్డులు అందాయా..?

ప్రకాశం జిల్లాలో ఇంకా కొందరు వివిద కారణాలతో తీసుకోని 38408 స్మార్ట్ రేషన్ కార్డులు అలానే ఉన్నాయన్నది అధికారిక లెక్క. మొత్తం 651820 స్మార్ట్ కార్డులు రాగా, అక్టోబర్ 11న అధికారులు పంపిణీ ప్రక్రియ ప్రారంభించారు. డీలర్లు, సచివాలయ సిబ్బంది ఇప్పటికి 613412 కార్డులను పంపిణీ చేశారు. మిగిలిన 38408 కార్డుల సంగతి అధికారులు తేల్చాల్సిఉంది. కార్డులు తీసుకోకపోతే వెనక్కి పంపేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
News December 20, 2025
ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు ఇదే టాక్.!

ప్రకాశం పాలి’ ట్రిక్స్’లో ఎప్పుడు ఏ ప్రచారం జరుగుతుందో ఊహించడం కష్టమే. మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విషయంలో రోజుకొక ప్రచారం సాగుతోంది. ఇటీవల బాలినేని గురించి ప్రకాశంలో తీవ్ర చర్చ సాగుతోంది. త్వరలో పవన్ కళ్యాణ్ పర్యటన ఉంటుందని ప్రచారం ఉండగా, అంతకు ముందు బాలినేనికి MLC పదవి వరించనుందని టాక్. ఇదే ప్రచారం బాలినేని జనసేనలోకి వెళ్లిన సమయంలోనూ సాగడం విశేషం.


