News September 17, 2024
ప్రకాశం: ఇవాళ్టి నుంచి స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు
జిల్లాలో ఈనెల 17 నుంచి అక్టోబర్ 2వ వరకూ స్వచ్చతా హీ సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్ దివస్ జరపనున్నట్లు తెలిపారు. స్వభావ్ స్వచ్ఛత – సంస్కార్ స్వచ్ఛత నినాదంతో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ చెప్పారు.
Similar News
News October 14, 2024
చీరాల: పులి శ్రీనివాసరావు కుటుంబాన్ని ఓదార్చిన MLA
కీర్తివారిపాలెం వద్ద జాతీయ రహదారిపై నిర్మిస్తున్న కల్వర్టు చప్టా కాల్వలో పులి శ్రీనివాసులు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా విషయం తెలుసుకున్న MLA కొండయ్య పాపాయిపాలెంలోని శ్రీను స్వగ్రామానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్షించారు. అనంతరం శ్రీనివాసరావు పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మృతిపై తక్షణమే సమగ్ర విచారణ జరపాలని పోలీసులను ఆదేశించారు.
News October 14, 2024
ప్రకాశం: మద్యం మత్తులో.. బ్లేడుతో గొంతు కోసుకున్న వ్యక్తి
మద్యం మత్తులో ఓ వ్యక్తి బ్లేడుతో గొంతు కోసుకున్న సంఘటన శనివారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే.. శింగరాయకొండ పంచాయతీలోని కందుకూరు డ్రైవర్‌పేట వద్ద నివాసముంటున్న తన్నీరు శివ మహేశ్ శనివారం ఫుల్‌గా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. అనంతరం మత్తులో బ్లేడుతో గొంతు కోసుకున్నాడు. అరుపులు విన్న చుట్టుపక్కల వారు గమనించి 108కి సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించారు.
News October 14, 2024
ఒంగోలులో ‘మీకోసం’ రద్దు
ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నేడు జరగాల్సిన ‘మీకోసం’ (గ్రీవెన్స్) కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి ఆర్ శ్రీలత తెలిపారు. జిల్లాలో మద్యం షాపుల కేటాయింపు కోసం నేడు లాటరీ ప్రక్రియను నిర్వహించాల్సి ఉంది. దీంతో జిల్లా కలెక్టరుతోపాటు ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ ప్రక్రియలో పాల్గొనాల్సి ఉన్నందున ‘మీకోసం’ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ఆమె వివరించారు.