News March 31, 2025

ప్రకాశం: ఇవాళ అర్ధరాత్రి వరకే ఛాన్స్

image

ఉగాది సందర్భంగా దోర్నాల-శ్రీశైలం మార్గంలో ఈనెల 27 నుంచి 24 గంటలూ వాహన రాకపోకలకు అటవీశాఖ అధికారులు అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇవాళ(సోమవారం)అర్ధరాత్రి 12 గంటలకు మాత్రమే వాహన రాకపోకలకు అనుమతులు ఉంటాయని దోర్నాల ఫారెస్ట్ రేంజర్ జీవన్ కుమార్ తెలిపారు. 12 గంటల తర్వాత వాహనాలను నిలిపివేస్తామని చెప్పారు. వాహనదారులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

Similar News

News April 4, 2025

ప్రకాశం: లక్ష్యాల మేరకు రుణాలు అందించండి: కలెక్టర్

image

బీసీ, ఈబీసీ, కాపు యాక్షన్ ప్లాన్ కింద బ్యాంకుల‌కు కేటాయించిన ల‌క్ష్యాల మేర‌కు రుణాలు మంజూరు చేసి ఆయా వర్గాల ప్రజల అభ్యున్నతికి తమ వంతు ఆర్థిక తోడ్పాటు అందించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా బ్యాంకర్లను కోరారు. గురువారం బీసీ కార్పోరేషన్ బ్యాంకుల అధికారులతో సమావేశమై, బీసీ కార్పోరేషన్ ద్వారా బీసీ, ఓసి, వర్గాలకు స్వయం ఉపాధి పథకాల కింద మంజూరు చేసిన యూనిట్స్ గ్రౌండింగ్ పురోగతి పై సమీక్షించారు.

News April 3, 2025

ప్రకాశం జిల్లా వాసులకు వాతావరణ శాఖ హెచ్చరికలు

image

ప్రకాశం జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ విపత్తుల నివారణ సంస్థ హెచ్చరికలు జారీచేసింది. గురువారం జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందన్నారు. పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపారు. వర్షం పడేటప్పుడు చెట్లు, టవర్స్, పోల్స్, పొలాలు, బహిరంగ ప్రదేశాలలో ఉండరాదని హెచ్చరించారు. సురక్షితమైన భవనాలలో ఆశ్రయం పొందాలని అధికారులు పేర్కొన్నారు.

News April 3, 2025

వెలిగండ్ల: ఇమ్మడి చెరువు సర్పంచ్ ఆత్మహత్య

image

వెలిగండ్ల మండలంలోని ఇమ్మడి చెరువు గ్రామ సర్పంచ్ తోకల బాలకృష్ణ(37) గురువారం ఉదయం బెంగళూరులో ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన వైసీపీ తరఫున సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. బాలకృష్ణ మృతి పట్ల మండలంలోని పలువురు వైసీపీ నాయకులు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!