News October 10, 2024
ప్రకాశం: ఈ కష్టం ఎవరికీ రాకూడదు..!

అతనో పేద రైతు. ఎంతో కష్టపడ్డాడు. అయినా సరే అప్పులే మిగిలాయి. మరోవైపు ఎదిగి వచ్చిన కుమార్తె పెళ్లి. తప్పనిస్థితిలో మరో రూ.3 లక్షలు అప్పు తెచ్చి ఇంట్లో పెట్టాడు. అర్ధరాత్రి ఆ నగదును దొంగలు దోచేశారు. ఉదయాన్నే నిద్రలేచిన రైతుకు డబ్బు కనపడకపోవడంతో బోరున విలపించారు. ఈ <<14311035>>బాధాకరమైన<<>> ఘటన ప్రకాశం జిల్లా కొమరోలు మండలం గోపాలునిపల్లె గ్రామంలోని వీరంరెడ్డి వాసుదేవరెడ్డి ఇంట్లో మంగళవారం అర్ధరాత్రి జరిగింది.
Similar News
News November 16, 2025
ప్రకాశం జిల్లాకు 2 రోజుల పాటు మోస్తరు వర్షసూచన

ప్రకాశం జిల్లాకు 2 రోజులపాటు మోస్తరు వర్షాలు కురిసే సూచన ఉన్నట్లు ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ శనివారం ప్రకటన విడుదల చేసింది. దీని ప్రభావం జిల్లాలోని పలు మండలాలపై ఉంటుందన్నారు. ఇది ఇలా ఉంటే జిల్లాలో ఇటీవల చలి ప్రభావం రోజురోజుకు పెరుగుతోంది.
News November 15, 2025
ప్రకాశం జిల్లాకు 2 రోజులు పాటు మోస్తరు వర్షసూచన

ప్రకాశం జిల్లాకు 2 రోజులపాటు మోస్తరు వర్షాలు కురిసే సూచన ఉన్నట్లు ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ శనివారం ప్రకటన విడుదల చేసింది. దీని ప్రభావం జిల్లాలోని పలు మండలాలపై ఉంటుందన్నారు. ఇది ఇలా ఉంటే జిల్లాలో ఇటీవల చలి ప్రభావం అధికంగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది.
News November 15, 2025
ప్రకాశం: ‘విద్యార్థులకు సురక్షిత తాగునీరు అందించాలి’

వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు సురక్షిత తాగునీరు అందించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఒంగోలులోని కలెక్టరేట్లో శుక్రవారం సాయంత్రం సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ప్రజలకు కనీస అవసరాలైన తాగునీరు అందించడంలో ఖర్చు చేస్తుందని వివరించారు.


