News June 2, 2024
ప్రకాశం: ఎన్నికల ఫలితాలు క్లారిటీ వచ్చినట్లేనా..? మీ కామెంట్..?
ఓట్ల పండగ ముగిసినప్పటి నుంచి ఊరు..వాడా ఎక్కడ చూసినా ఎన్నికల ఫలితాలపైనే అందరి దృష్టి నెలకొంది. కాగా ఉమ్మడి ప్రకాశంలోని 12 స్థానాలకు సంబంధించి పలు సర్వే సంస్థలు ఫలితాలను అంచనావేశాయి. చాణక్య స్ట్రాటజీస్ సంస్థ కూటమికి 9, YCPకి 2, ఒకటి టఫ్ ఫైట్ ఉంటుందని, కేకే సంస్థ కూటమి-11, YCP-1 గెలుస్తాయని సర్వేలో పేర్కొన్నాయి. ఇదే తుది ఫలితం కాకపోయినప్పటికీ ఓ అంచనా వచ్చేందుకు దోహదపడుతోంది. ఇంతకీ మీ అంచనా ఏంటి..?
Similar News
News September 17, 2024
ఒంగోలులో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
ఒంగోలు నగర పరిధిలోని హర్షిణి జూనియర్ ఇంటర్ కాలేజీల్లో ఓ విద్యార్థిని మంగళవారం ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న వడ్డిముక్కల భావన మంగళవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆ విద్యార్థిని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి దర్యాప్తు చేస్తున్నారు.
News September 17, 2024
ఎమ్మెల్యే బూచేపల్లి హౌస్ అరెస్ట్
తమ నేతలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ దర్శిలో నేడు నిరసన కార్యక్రమానికి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో ఉదయం ఆయన నివాసానికి వెళ్లి ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి, జడ్పీ ఛైర్మన్ వెంకాయమ్మకు నోటీసులు అందజేసి గృహ నిర్బంధం చేస్తున్నట్లు ఎమ్మెల్యేకు సూచించారు. వారితో పాటు, టీడీపీ నాయకులకు సైతం నోటీసులు ఇచ్చారు.
News September 17, 2024
బాలినేని దారెటు?
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసుల రెడ్డి ఎపిసోడ్ పలు మలుపులు తిరుగుతూ సాగుతోంది. ఆయన ఎన్నికల ముందు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఇక ఓటమి తర్వాత ఒంగోలులో రీ వెరిఫికేషన్ కోసం చేస్తున్న ప్రయత్నాన్ని పార్టీ అధిష్ఠానం పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఇటీవల మళ్లీ ఆయన పార్టీ మారుతున్నట్లు పెద్ద చర్చే జరిగింది. దీంతో ఆయన దారెటు అంటూ జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.