News August 2, 2024
ప్రకాశం ఎస్పీ స్ట్రాంగ్ వార్నింగ్

ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ రాజకీయ నాయకులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాజకీయ కారణాలతో ఘర్షణలకు పాల్పడితే రౌడీషీట్లు తెరుస్తామన్నారు. మహిళలు, చిన్నారులు, విద్యార్థునులను ఎవరైనా వేధిస్తే కటకటాల ఊసలు లెక్కిస్తారని హెచ్చరించారు. జిల్లాలో భూకబ్జాలకు పాల్పడితే పోలీస్ పవర్ ఏంటో చూపిస్తామన్నారు. ఇప్పటికే నేరాలు చేసి బెయిల్పై కాని, విడుదలైన వారిపై పోలీసుల నిఘా ఉంటుందని సూచించారు.
Similar News
News November 25, 2025
ప్రకాశం: రహదారి దాటుతున్నారా.. ఈ రూల్స్ తెలుసుకోండి.!

రహదారి దాటుతున్నారా.. కాస్త రూల్స్ పాటించండి అంటున్నారు ప్రకాశం పోలీస్. ఇప్పటికే సైబర్ నేరాలపై, రహదారి భద్రతా నియమాలపై అవగాహన కల్పిస్తున్న ప్రకాశం పోలీసులు మంగళవారం సోషల్ మీడియా ద్వారా ప్రకటన జారీ చేశారు. రహదారులు దాటే సమయంలో ప్రతి ఒక్కరూ జీబ్రా లైన్లను ఉపయోగించాలని సూచించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద తప్పనిసరిగా సిగ్నల్ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని కోరారు.
News November 25, 2025
ప్రకాశం: ఉద్యానవన సాగు రైతులకు గుడ్ న్యూస్.!

ప్రకాశం జిల్లాలో ఉద్యానవన సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తగిన కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు మంగళవారం ఉద్యానవన శాఖలపై సమీక్షించిన సందర్భంగా ప్రకాశం జిల్లా రైతుల విషయంపై సైతం మాట్లాడారు. రాయలసీమ, ప్రకాశంలో 92 క్లస్టర్లద్వారా ఉద్యానవన పంటల సాగును ప్రభుత్వం ప్రోత్సహించేందుకు కార్యాచరణ రూపొందిస్తుందన్నారు. రైతులకు ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం ముందడుగు వేసిందని చెప్పవచ్చు.
News November 25, 2025
అక్కడ ఆయన.. ఇక్కడ ఈయనపై విచారణ..!

తిరుమల వివాదాల్లో ఇద్దరు రాజకీయ నాయకులను ప్రత్యేక దర్యాప్తు బృందాలు విచారించాయి. కల్తీ నెయ్యి కేసులో HYDలో వైవీ సుబ్బారెడ్డిని సీబీఐ సిట్, పరకామణీ కేసులో తిరుపతిలో భూమన కరుణాకర్రెడ్డిని సీఐడీ విచారించడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. గతంలో ఎన్నడు లేనివిధంగా టీటీడీలో చోటుచేసుకున్న వివాదాలు.. మాజీ ఛైర్మన్ల విచారణపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


