News November 19, 2024
ప్రకాశం: ఒక బిడ్డ జననం.. క్షణాల్లో మరో బిడ్డ మరణం

దోర్నాలలో ఓ తల్లికి బిడ్డకు జన్మనిచ్చానన్న ఆనందం కొన్ని క్షణాలు కూడా లేకుండా పోయింది. బాధితుల వివరాల ప్రకారం.. దోర్నాల మండలం నందిగూడేనికి చెందిన గురవయ్య భార్య వీరమ్మ సోమవారం ఓ బాబుకు జన్మనిచ్చింది. ఆమెను చూడటానికి అతడు, తన కూతురు పల్లవి అలాగే ఆశా వర్కర్ నాగమ్మను బైక్పై బయల్దేరారు. కొత్తూరు సమీపంలోకి రాగనే వారిని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పల్లవి(2), నాగమ్మ(36) అక్కడికక్కడే మృతి చెందారు.
Similar News
News November 23, 2025
ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీగా బాపట్ల ఎస్పీ

ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీగా బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వర్ నియమించబడ్డారు. ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు డిసెంబర్ రెండు వరకు సెలవుల్లో ఉండడంతో, ప్రభుత్వం ఈ మేరకు బాపట్ల ఎస్పీని ఇన్ఛార్జ్గా నియమించింది. దీనితో జిల్లా బాధ్యతలను బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వర్ చేపట్టారు. డిసెంబర్ మూడో తేదీన ఎస్పీ హర్షవర్ధన్ రాజు మళ్లీ విధుల్లో చేరనున్నారు.
News November 23, 2025
కనిగిరిపై కనికరించండి.. మహాప్రభో.!

కనిగిరిని కొత్తగా ఏర్పడే మార్కాపురం జిల్లాలో కలపవద్దని ప్రజలు అంటున్నారు. ఇప్పుడిప్పుడే అభివృద్ధి పథంలో నడుస్తున్న కనిగిరిని మళ్లీ కొత్త జిల్లాలో కలిపే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సూచిస్తున్నారు. రెవెన్యూ డివిజన్ కావాలన్న కల నెరవేరిన మూడేళ్లలోనే మళ్లీ మార్పులు వద్దన్న వాదన వినిపిస్తోంది. ప్రకాశం జిల్లాలోనే కనిగిరి ఉండాలా? కొత్తగా ఏర్పడే మార్కాపురం జిల్లాలోకి మారాలా? మీరేమనుకుంటున్నారో కామెంట్.
News November 23, 2025
ప్రకాశంలో కలవనున్న ఆ నియోజకవర్గాలు.!

ప్రకాశం ప్రజల కోరిక నెరవేరే టైం దగ్గరపడింది. అటు మార్కాపురం జిల్లా కావాలన్నది 40 ఏళ్ల కల. ఇటు విడిపోయిన అద్దంకి, కందుకూరు కలవాలన్నది మూడేళ్ల కల. 2022లో జిల్లాల విభజన సమయంలో అద్దంకి, కందుకూరు ప్రజలు తమను ప్రకాశం జిల్లాలో ఉంచాలని పట్టుబట్టారు. కానీ బాపట్ల వైపు అద్దంకి, నెల్లూరు వైపు కందుకూరు వెళ్లాయి. మార్కాపురం జిల్లా ఏర్పాటు సన్నాహాల నేపథ్యంలో మళ్లీ ఇవి ప్రకాశం వైపు రానున్నాయి.


