News February 17, 2025
ప్రకాశం: కంభంలో మహిళ ఆత్మహత్య

కంభం మండలంలో వ్యాస్మాల్ తాగి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల వివరాల మేరకు.. గోవిందాపురానికి చెందిన శ్యామల భర్తతో విడిపోయి కంభంలోని బేకరీలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. ఈ క్రమంలో ఓ ఆటో డ్రైవర్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇద్దరి మధ్య గొడవ కారణంగా మనస్తాపం చెంది ఆదివారం వ్యాస్మాల్ తాగి ఆత్మహత్యకు పాల్పడింది. మార్కాపురం ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది.
Similar News
News March 27, 2025
ప్రకాశం: ఈ 9 మండలాల ప్రజలు జాగ్రత్త..!

ప్రకాశం జిల్లాలోని 9 మండలాల్లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కావటంతో పాటు వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. చీమకుర్తిలో 40.6, దర్శిలో 41.5, దొనకొండలో 40.7, కురిచేడులో 41.3, ముండ్లమూరులో 41.5, పొదిలిలో 41, పుల్లలచెరువులో 40.9, తాళ్లూరులో 41.2, త్రిపురాంతకంలో 41 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదవుతుందని తెలిపారు. అత్యవసరమైతే తప్పించి ప్రజలెవరూ బయటకు రావద్దని సూచించారు.
News March 27, 2025
ఒంగోలు: కంప్యూటర్ టెస్ట్ వాయిదా

ఒంగోలు ఏబీఎన్ హైస్కూల్, ముప్పవరంలోని పీఎస్ ఎన్‌సీసీ హైస్కూల్, చీరాల రామకృష్ణాపురంలోని ఎమ్మెస్ హైస్కూల్లో ఎయిడెడ్ పోస్టుల నియామకానికి ఈనెల 28, 29వ తేదీల్లో కంప్యూటర్ టెస్ట్ జరగాల్సి ఉంది. కొన్ని కారణాలతో టెస్ట్ వాయిదా వేసినట్లు డీఈవో కిరణ్ కుమార్ తెలిపారు. ఈ విషయాన్ని కంప్యూటర్ టెస్ట్‌కు సంబంధించిన అభ్యర్థులు గమనించాలని కోరారు. తదుపరి తేదీని త్వరలో వెల్లడిస్తామన్నారు.
News March 27, 2025
ప్రకాశం జిల్లాలో టెన్షన్.. టెన్షన్

ప్రకాశం జిల్లాలో మరికాసేపట్లో ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కోఆప్షన్ పదవులకు ఉప ఎన్నిక జరగనుంది. వైసీపీకి పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ.. ఆ పార్టీకి షాక్ ఇవ్వడానికి కూటమి నాయకులు ప్లాన్ చేశారని సమాచారం. త్రిపురాంతకం వైసీపీ ఎంపీపీ అభ్యర్థి ఆళ్ల ఆంజనేయరెడ్డి జైల్లో ఉన్నారు. మరి అక్కడ ఆయన గెలుస్తారా? లేదా? అనేది ఆసక్తి రేపుతోంది. నిన్న రాత్రి నుంచే పోలీసులు అప్రమత్తంగా ఉంటూ 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.