News November 13, 2024

ప్రకాశం కలెక్టర్‌తో భేటీ అయిన దామచర్ల సత్య

image

ఒంగోలులోని ప్రకాశం భవన్‌లో ఉన్న కలెక్టరేట్‌లో కలెక్టర్ తమీమ్ అన్సారియాను మంగళవారం సాయంత్రం రాష్ట్ర మారిటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య కలిసి పలు ప్రజా సమస్యలపై చర్చించారు. కొండపి నియోజకవర్గంలో అపరిష్కృతంగా ఉన్న పలు సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని సత్య కోరారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటూ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్‌కు సత్య అందజేశారు.

Similar News

News July 6, 2025

’10న మెగా పేరెంట్ – టీచర్ మీటింగ్’

image

ప్రకాశం జిల్లాలో ఈనెల 10వ తేదీన జరిగే మెగా పేరెంట్ – టీచర్ మీటింగ్‌ను విజయవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ ఆర్. గోపాలకృష్ణ అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలల్లో ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. తల్లిదండ్రులు కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలన్నారు.

News July 5, 2025

పవన్ రాకతో.. జిల్లా జనసేన ఆల్ సెట్.!

image

ప్రకాశం జిల్లాలో జనసేన సెట్ అయినట్లేనన్న టాక్ నడుస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ రాకతో జనసేన బలోపేతంపై క్యాడర్ దృష్టిసారించనున్నట్లు ప్రచారం సాగుతోంది. విభేదాలు వీడి ఒకే తాటిపైకి రావాలని మార్కాపురం పర్యటన సందర్భంగా వన్ నాయకులకు సూచించినట్లు సమాచారం. దీనితో జిల్లాలో క్యాడర్ ఒకే తాటిపైకి వచ్చి పార్టీపై దృష్టి సారించే పరిస్థితి ఉందట. చివరికి పవన్.. జిల్లాలో ఆల్ సెట్ చేసినట్లేనని టాక్ వినిపిస్తోంది.