News April 3, 2025

ప్రకాశం: కానిస్టేబుల్‌పై కత్తితో దాడి

image

స్థల వివాదం నేపథ్యంలో CISF కానిస్టేబుల్‌ నాగేశ్వరరావుపై దాడి చేశారు. ఈ ఘటన ఉమ్మడి ప్రకాశం జిల్లా చీరాల మండలం గవినివారిపాలెంలో జరిగింది. భరత్, వీరయ్య, లక్ష్మీనారాయణకు, నాగేశ్వరరావుకు స్థల గొడవలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కానిస్టేబుల్‌పై మరో ఇద్దరితో కలిసి వారు దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదుతో బుధవారం 5గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు.

Similar News

News April 11, 2025

ప్రకాశం జిల్లా విద్యార్థుల ఎదురుచూపు

image

ప్రకాశం జిల్లాలో ఇంటర్ పరీక్షలు ఇటీవల పూర్తయిన విషయం తెలిసిందే. మొత్తం 67 పరీక్షా కేంద్రాల్లో 42,439 మంది పరీక్షలు రాశారు. ఇందులో మొదటి సంవత్సర విద్యార్థులు 21,624 మంది కాగా, సెకండియర్ విద్యార్థులు 20,815 మంది ఉన్నారు. వీరి భవితవ్యం శనివారం తేలనుంది. దీంతో విద్యార్థుల్లో టెన్షన్ నెలకొంది.
☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

News April 11, 2025

మార్కాపురం: రైలు ఢీకొని ప్రాణాలతో బయటపడ్డాడు

image

మార్కాపురం రైల్వే స్టేషన్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మార్కాపురంలోని విజయ టాకీస్ ఏరియాకు చెందిన అయ్యప్ప అనే వ్యక్తి రైలు పట్టాల వద్దకు చేరుకున్నాడు. మార్కాపురం నుంచి గుంటూరు వెళ్లే రైలు కింద ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు. దీంతో రైలు ఢీకొన్న వెంటనే అయ్యప్ప పక్కకు పడిపోవడంతో తీవ్ర గాయాలై ప్రాణాలతో బయటపడ్డాడు. వెంటనే రైల్వే పోలీసులు చేరుకుని అతడిని వైద్యశాలకు తరలించారు.

News April 11, 2025

ప్రకాశం: నిప్పులు కురిపించిన భానుడు

image

కనిగిరి నియోజకవర్గంలోని నందన మారెళ్ళలో గురువారం రాష్ట్రంలోనే అత్యధికంగా 41.8° ఉష్ణోగ్రత నమోదయినట్టు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఉదయం 11 నుంచి సాయంత్రం నాలుగులోపు అత్యవసరం అయితే తప్ప బయట తిరగవద్దు అని పేర్కొన్నారు.

error: Content is protected !!