News September 26, 2024
ప్రకాశం: కేజీబీవీల్లో సిబ్బంది నియామకానికి దరఖాస్తులు

జిల్లాలోని కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న బోధన, బోధనేతర సిబ్బందిని ఒప్పంద, అవుట్ సోర్సింగ్ విధానంలో నియామకాలు చేపడుతున్నట్లు డీఈవో డి. సుభద్ర పేర్కొన్నారు. బోధనా సిబ్బందిని ఒప్పంద విధానంలో, బోధనేతర సిబ్బందిని అవుట్ సోర్సింగ్ కింద 2024-25 సంవత్సర కాలానికి భర్తీ చేస్తామన్నారు. ఆసక్తిగల మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆన్లైన్లో రూ.250లు చెల్లించి దరఖాస్తు చేయాలన్నారు.
Similar News
News October 25, 2025
కొండపి: స్కూల్ బస్సుకు తృటిలో తప్పిన పెను ప్రమాదం

కొండపిలో ఓ ప్రైవేటు స్కూల్ బస్సుకు శనివారం పెను ప్రమాదం తప్పింది. కొద్ది రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు కొండపి నుంచి అనకర్లపూడి వెళ్లే బస్సు పక్కకు ఒరిగింది. ఆ సమయంలో బస్సులో 40 మందికిపైగా విద్యార్థులు ఉన్నారు. డ్రైవర్ చాకచక్యంతో విద్యార్థులను సురక్షితంగా బస్సు నుంచి కిందకు దించటంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని స్థానికులు తెలిపారు.
News October 25, 2025
కర్నూలు ఎఫెక్ట్.. ప్రకాశం ట్రావెల్స్ బస్సులకు హడల్..!

కర్నూల్లో ట్రావెల్స్ బస్సు ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. జిల్లాలోని నేషనల్ హైవేలలో రాకపోకలు సాగిస్తున్న ట్రావెల్స్ బస్సుల రికార్డులను పరిశీలించారు. ఈ తనిఖీలు జిల్లా వ్యాప్తంగా సాగాయి.
News October 25, 2025
ప్రకాశంను వదలని వాన.. నేడు కూడా దంచుడే.!

ప్రకాశంను వర్షం వదిలేలాలేదని వాతావరణ శాఖ తెలిపింది. సూర్యుడు ఉదయించని రోజులను జిల్లా ప్రజలు వరుసగా 3 రోజులుగా చవిచూస్తున్నారు. తాజాగా ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ శనివారం జిల్లాకు భారీ వర్ష సూచన ఉన్నట్లు ప్రకటించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం నేటి నుంచి ఆగ్నేయ, దాని ప్రక్కనే ఉన్న మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడుతుందన్నారు. సోమవారంకు ఇది తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది.


