News October 8, 2024

ప్రకాశం: కేజీబీవీల్లో 52 నాన్ టీచింగ్ పోస్టులు

image

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ 52 నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు డీఈఓ డి.సుభద్ర తెలిపారు. అర్హులైన మహిళా అభ్యర్థులు ఈ నెల 15వ తేదీలోగా ఎంఈఓ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 18న తుది జాబితా తయారు చేస్తామని, 21న జిల్లా కమిటీ ఆమోదం తర్వాత 22న ఆప్కాస్ ఛైర్మన్‌కు జాబితాను సమర్పిస్తామని అన్నారు.

Similar News

News December 11, 2025

BREAKING: గిద్దలూరు మాజీ MLA మృతి

image

గిద్దలూరు మాజీ MLA పిడతల రామ్ భూపాల్ రెడ్డి (89) స్వర్గస్థులయ్యారు. వయో భారంతో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాదులోని ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతున్న రామ్ భూపాల్ రెడ్డి ఈ తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. రామ భూపాల్ రెడ్డి TDP నుంచి పోటీ చేసి 1994లో MLAగా ఎన్నికయ్యారు. ఆయన కుమారుడు పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి వైసీపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

News December 11, 2025

ప్రకాశం జిల్లా కలెక్టర్‌కు 24వ ర్యాంకు.!

image

ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా రాజాబాబు ఇటీవల బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. తనదైన శైలిలో పనిచేస్తూ ఎప్పటికప్పుడు ఫైల్స్ క్లియర్ చేస్తున్నారు. బాధ్యతలు చేపట్టాక ఆయన 388 ఫైల్స్ స్వీకరించారు. ఇందులో 356 ఫైల్స్ క్లియర్ చేశారు. ఒక్కో ఫైల్‌ను కేవలం 9 రోజుల వ్యవధిలోనే క్లియర్ చేయడంతో ఆయనకు CM చంద్రబాబు రాష్ట్రంలో 24వ ర్యాంకు కేటాయించారు.

News December 11, 2025

ప్రకాశం: గ్యాస్ కనెక్షన్ లేకుంటే వెంటనే లబ్ధి చేకూర్చాలి.!

image

ప్రకాశం జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ లేని నిరుపేద కుటుంబాలకు వెంటనే గ్యాస్ కనెక్షన్ అందించేలా చర్యలు తీసుకోవాలని జేసీ గోపాలకృష్ణ ఆదేశించారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీ డిస్ట్రిబ్యూటర్లతో జేసీ బుధవారం సమావేశమయ్యారు. గ్యాస్ డెలివరీ బాయ్స్ ప్రవర్తనపై ఐవిఆర్ఎస్ ద్వారా ఫీడ్ బ్యాక్ తీసుకోవడం జరుగుతుందన్నారు. డెలివరీ సమయంలో అక్రమ వసూళ్లకు పాల్పడవద్దన్నారు.