News March 10, 2025
ప్రకాశం: కొరియర్ల పేరుతో భారీ స్కాములు

ప్రకాశం జిల్లాలో సైబర్ నేరగాళ్లు కొత్తరకం స్కాములకు పాల్పడుతున్నారు. తాజాగా గిద్దలూరులో కొందరికి సైబర్ నేరగాళ్లు స్పీడ్ పోస్ట్లో లక్కీ డ్రా గెలుచారని పోస్టు పంపించారు. కొరియర్ తెరిచి చూడగా లక్కీ డ్రాలో రూ.14,49,000 గెలుచుకున్నారని, ఈ డబ్బు అకౌంట్లో బదిలీ చేయాలంటే రూ.15వేల అమౌంట్ బదిలీ చేయాలని కోరుతున్నట్లు సమాచారం. ఇలాంటి వాటిపై స్పందించి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడొద్దని అధికారులు సూచిస్తున్నారు.
Similar News
News October 23, 2025
ప్రకాశం: ఇళ్లు కట్టుకునేవారికి GOOD NEWS

రాష్ట్ర ప్రభుత్వం ‘ హౌసింగ్ ఫర్ ఆల్ ‘ పథకంలో భాగంగా పేదలకు సొంత ఇంటి స్థలం మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నందున అర్హులు దరఖాస్తు చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ..GO ఎంఎస్ నెంబర్ -23 ప్రకారం పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు చొప్పున ఇంటి స్థలం కేటాయిస్తామని అన్నారు. సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News October 23, 2025
వర్షం ఎఫెక్ట్.. ప్రకాశం జిల్లాకు NDRF బృందాలు

ప్రకాశం జిల్లాకు మరో రెండు రోజులపాటు భారీ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగానికి హోంమంత్రి అనిత బుధవారం కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లాకు NDRF బృందాలను పంపించేలా ఆమె ఆదేశించారు. దీంతో ప్రకాశం జిల్లాపై ఎలాంటి తుఫాన్ ప్రభావం ఉన్నా ఎదుర్కొనేందుకు జిల్లా అధికారులు, కలెక్టర్ రాజాబాబు సారథ్యంలో సిద్ధమయ్యారు.
News October 23, 2025
మార్కాపురం జిల్లా ఏర్పాటుకు మరో అడుగు

మార్కాపురం జిల్లా ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలను పంపించాలని భూ పరిపాలన శాఖ చీఫ్ కమిషనర్ జి.జయలక్ష్మి చెప్పారు. బుధవారం ఆమె అమరావతి సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఒంగోలు ప్రకాశం భవనం నుంచి కలెక్టర్ పి.రాజాబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా మార్కాపురం జిల్లా ప్రతిపాదనపై సుదీర్ఘ చర్చ సాగగా.. ప్రతిపాదనలపై దృష్టి సారించాలని కలెక్టర్కు జయలక్ష్మి సూచించారు.


