News March 10, 2025

ప్రకాశం: కొరియర్ల పేరుతో భారీ స్కాములు

image

ప్రకాశం జిల్లాలో సైబర్ నేరగాళ్లు కొత్తరకం స్కాములకు పాల్పడుతున్నారు. తాజాగా గిద్దలూరులో కొందరికి సైబర్ నేరగాళ్లు స్పీడ్ పోస్ట్‌లో లక్కీ డ్రా గెలుచారని పోస్టు పంపించారు. కొరియర్ తెరిచి చూడగా లక్కీ డ్రాలో రూ.14,49,000 గెలుచుకున్నారని, ఈ డబ్బు అకౌంట్లో బదిలీ చేయాలంటే రూ.15వేల అమౌంట్ బదిలీ చేయాలని కోరుతున్నట్లు సమాచారం. ఇలాంటి వాటిపై స్పందించి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడొద్దని అధికారులు సూచిస్తున్నారు.

Similar News

News February 9, 2026

ప్రకాశం SP స్పందనకు 124 ఫిర్యాదులు

image

ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఎస్పీ మీకోసం కార్యక్రమానికి 124 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు.. పోలీసు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఫిర్యాదుదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులు వెంటనే ఫిర్యాదులను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News February 9, 2026

ప్రకాశం: ACB దాడులు.. రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన అధికారి

image

ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం కే.పల్లిపాలెం పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ సంపత్ కుమార్ లంచం తీసుకుంటూ ACBకి రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు. సోమవారం ఆయన రూ.55 వేలు డిమాండ్ చేసి తీసుకుంటుండగా అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. అనంతరం సంపత్ కుమార్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో పలు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఓ వ్యక్తి నుంచి నగదు తీసుకుంటూ పట్టుబడ్డాడు.

News February 9, 2026

మార్కాపురం: లోయలో పడిన కారు.. ఒకరి మృతి

image

మార్కాపురం జిల్లాలో విషాదం నెలకొంది. CSపురం ఎస్ఐ వెంకటేశ్వర్లు నాయక్ వివరాల ప్రకారం.. కురిచేడు మండలానికి చెందిన విష్ణు భార్గవ్(25) గత నెల 17న తిరుమలనాథ స్వామి తిరుణాల నిమిత్తం కోనపల్లికి కారులో వెళ్లాడు. తిరిగి వస్తుండగా CSపురం మండలం తుంగోడు ఘాట్ రోడ్డు లోయలో కారు పడిపోయింది. ఇవాళ ఉదయం అతడి మృతదేహాన్ని గుర్తించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.