News March 25, 2024
ప్రకాశం: ‘క్రికెట్ బెట్టింగులకు పాల్పడితే కఠిన చర్యలు’
క్రికెట్ బెట్టింగులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. క్రికెట్ బెట్టింగులకు పాల్పడడం చట్టరీత్యా నేరమని, ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. బెట్టింగ్‌ల సమాచారాన్ని ఎవరైనా సమాచారం అందిస్తే వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు. డబ్బులకు అశపడి బెట్టింగులు ఆడి నష్టపోతే ఆ కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తాయని ఎస్పీ పేర్కొన్నారు.
Similar News
News November 6, 2024
అభ్యంతరం ఉంటే చెప్పండి: ప్రకాశం డీఈవో
ప్రకాశం జిల్లాలోని కేజీబీవీల్లో పోస్టులకు ప్రకటించిన మెరిట్ జాబితాపై అభ్యంతరాలు తెలిపేందుకు గడువు పొడిగించినట్లు డీఈవో కిరణ్ కుమార్ చెప్పారు. మొత్తం 51 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకు సబ్జెక్టుల వారీగా 1.10 చొప్పున మెరిట్ జాబితా తయారు చేసి జేసీకి సమర్పించారు. వివరాలు నోటీసు బోర్డులో ఉంచారు. దీనిపై అభ్యంతరాలుంటే ఈనెల 6వ తేదీ నుంచి 8వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు తెలపాలని డీఈవో కోరారు.
News November 6, 2024
రేపు ప్రకాశం జిల్లాకు ఫుడ్ కమిషన్ ఛైర్మన్ రాక
ఏపీ ఫుడ్ కమిషన్ ఛైర్మన్ విజయ ప్రతాపరెడ్డి ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. గురు, శుక్రవారాల్లో జిల్లా పర్యటన ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ పాఠశాలల్లో మిడ్ డే మీల్స్, అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసే అవకాశం ఉందని చెప్పారు.
News November 6, 2024
వేటపాలెం: మతిస్థిమితం లేని మహిళపై లైంగిక దాడి
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. పోలీసుల వివరాల మేరకు.. వేటపాలెం మండలం పార్వతీపురంలో మతిస్థిమితం లేని అవివాహిత(34) ఉంటోంది. ఆమె తండ్రి చనిపోగా.. తల్లి పాచి పనులు చేసి పోషిస్తోంది. ఈక్రమంలో ఆమె పనులకు వెళ్లగా.. అదే ఏరియాలో ఆకుకూరలు అమ్మే సుబ్బారెడ్డి ఇంట్లోకి చొరబడ్డాడు. మతిస్థిమితం లేని మహిళపై లైంగిక దాడి చేశాడు. ఎస్ఐ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేశారు.