News April 11, 2024
ప్రకాశం: గుండెపోటుతో ఉపాధి కూలీ మృతి

జిల్లాలోని రాచర్ల మండలం అనుములపల్లిలో ఉపాధి పనికి వెళ్లిన కూలీ గల్ల ఆంజనేయులు (55) గుండెపోటుతో గురువారం మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. ఉపాధి హామీ పనిచేస్తుండగా ఆంజనేయులుకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. మిగతా కూలీలు గమనించి హుటాహుటిన రాచర్లలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. కానీ అప్పటికే ఆంజనేయులు మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు.
Similar News
News March 24, 2025
ప్రకాశం: నేటి నుంచి ఇన్విజిలేటర్ల మార్పు

ప్రకాశం జిల్లాలోని 10వ తరగతి పరీక్షా కేంద్రాల్లో ఇన్విజిలేటర్లను మారుస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలోని 146 పరీక్ష కేంద్రాల్లో గణితం పరీక్ష నుంచి 1,300 మందిని జంబ్లింగ్ రూపంలో మార్చారు. గణితం పీఎస్, ఎన్ఎస్, సోషల్ స్టడీస్ పరీక్షలకు ఇన్విజిలేటర్లను జంబ్లింగ్ పద్ధతిలో మార్చామని, వారు ఆయా కేంద్రాలలో విధులు నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.
News March 24, 2025
ప్రకాశం: EKYC ఎక్కడ చేస్తారంటే..?

EKYC కాకుంటే వచ్చేనెల నుంచి రేషన్ సరకులు అందవని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రకాశం జిల్లాలో 6.61లక్షల రేషన్ కార్డుల ఉండగా.. లబ్ధిదారుల సంఖ్య 19.37లక్షలుగా ఉంది. ఇందులో 17.31లక్షల మందే EKYC చేయించుకున్నారు. రాష్ట్రంలో ఎక్కడున్నా సరే.. అక్కడి మీసేవ, రేషన్ షాపు, ఆధార్ సెంటర్ల ద్వారా EKYC చేస్తారు. ఐదేళ్ల లోపు పిల్లలు తప్ప.. రేషన్ కార్డులో ఉన్నవారంతా EKYC చేయించుకోవాలి. ఈనెల 31 వరకు గడువు.
News March 23, 2025
మార్కాపురంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు సూసైడ్

కుటుంబ కలహాల నేపథ్యంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మార్కాపురంలో చోటుచేసుకుంది. స్థానిక కొండేపల్లి రోడ్డులో నివాసం ఉంటున్న చదలవాడ పద్మజ (52) ZPH బాలికల ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. అయితే గత కొన్నేళ్లుగా భార్యాభర్తల మధ్య వివాదం చోటు చేసుకుంటున్నట్లు SI సైదుబాబు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.