News April 4, 2024

ప్రకాశం: గుప్త నిధుల కోసం తవ్వకాలు

image

కొనకనమిట్ల మండలం వాగుమడుగు పంచాయతీ పరిధిలోని అంబాపురం గ్రామ శివారులో పురాతనమైన అంబబాలత్రిపుర సుందరీదేవి ఆలయంలో కొందరు దుండగులు గుప్తనిధుల కోసం తవ్వకాలు చేశారు. ఆలయం వెనక వైపు రాతి గోడలను ధ్వంసం చేశారు. గ్రామస్థులు గమనించి బుధవారం పోలీసులకు సమాచారం అందించడంతో ఏఎస్సై గోపాలకృష్ణ పరిశీలించారు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు.

Similar News

News December 6, 2025

గుంటూరులో ప్రకాశం జిల్లా వాసి అరెస్ట్

image

మహిళ ఫొటోలను మార్ఫింగ్ చేసి FBలో దుష్ప్రచారం చేస్తున్న ప్రకాశం జిల్లా వాసిని గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ వెంకటేశ్వర్లు వివరాల మేరకు.. గుంటూరుకు చెందిన ఓ మహిళ ఫొటోలను గిద్దలూరు మండలం కృష్ణంశెట్టిపల్లికి చెందిన నాగిరెడ్డి మధుసూదన్ రెడ్డి మార్ఫింగ్ చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు.

News December 6, 2025

ప్రకాశంలో స్క్రబ్ టైఫస్‌తో మహిళ మృతి.. కానీ!

image

ప్రకాశంలో స్క్రబ్ టైఫస్ వ్యాధి పాజిటివ్ వచ్చిన మహిళ మృతి చెందినట్లు డీఎంహెచ్వో వెంకటేశ్వర్లు తెలిపారు. ఎర్రగొండపాలెం మండలానికి చెందిన వృద్ధురాలు గత నెల 11న అనారోగ్యానికి గురై మెరుగైన చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్‌కు వెళ్లారన్నారు. 29న అక్కడ నిర్వహించిన టెస్టుల్లో స్క్రబ్ టైఫస్ పాజిటివ్ వచ్చిందన్నారు. ఇతర దీర్ఘకాలిక వ్యాధులు కూడా మృతికి కారణంగా డీఎంహెచ్వో తెలిపారు.

News December 6, 2025

మోసపోవద్దు తస్మాత్ జాగ్రత్త: ప్రకాశం పోలీస్

image

వాట్సాప్‌లకు వచ్చే ఏపీకే ఫైల్స్ క్లిక్ చేసి మోసపోవద్దని ప్రకాశం పోలీసులు తాజాగా హెచ్చరించారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు సైబర్ నేరాలపై పోలీసులు విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం ఏపీకే ఫైల్స్ జోలికి వెళ్లవద్దని పోలీసులు సోషల్ మీడియా ద్వారా ఒక ప్రకటన చేశారు. బ్యాంక్, అధికారుల పేర్లతో వచ్చే ఏపీకే ఫైల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, వాటిని క్లిక్ చేయవద్దని సూచించారు.