News May 18, 2024
ప్రకాశం: గెలుపుపై ఎవరి లెక్కలు వారివి

సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన క్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 అసెంబ్లీ సెగ్మెంట్లలో గెలుపు, ఓటములపై ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరి లెక్కల్లో వారు మునిగితేలుతున్నారు. బూత్ల వారీగా పోలైన ఓట్లను సమీక్షిస్తూ లెక్కలు వేసుకుంటున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో మహిళల ఓటింగ్ ఎక్కువగా జరిగింది. దీంతో ఎవరిని విజయం వరిస్తుందో.. ఓటర్లు ఎవరి వైపు నిలిచారో తెలియాలంటే జూన్ 4న ఆగాల్సిందే.
Similar News
News November 5, 2025
నష్టం వివరాలను త్వరగా పంపించండి: కలెక్టర్

తుఫాన్ నేపథ్యంలో జరిగిన నష్టం వివరాలను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలన చేసి వెంటనే నివేదికలు పంపించాలని కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. ఈ మేరకు ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం నుంచి మండల స్థాయి అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో చేపట్టిన ఈ పంట ప్రక్రియను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలన్నారు. అలాగే దెబ్బతిన్న రహదారుల వివరాలను సైతం పంపాలన్నారు.
News November 5, 2025
ప్రకాశం: సముద్ర స్నానానికి వస్తున్నారా.. ఈ జాగ్రత్తలు పాటించండి!

కార్తీక పౌర్ణమి సందర్భంగా సముద్ర స్నానాలకు వచ్చే భక్తులు పలు జాగ్రత్తలు పాటించాలని మెరైన్ పోలీసులు ప్రకటన విడుదల చేశారు. ☛ పోలీసుల సూచనలు పాటించాలి☛ తీరం లోపలికి పోకుండా.. నిర్దిష్ట ప్రదేశంలో స్నానాలను ఆచరించాలి☛ అలల ఉధృతి సమయంలో జాగ్రత్త వహించాలి☛ చిన్నారులను తీరం లోపలికి తీసుకువెళ్లకపోవడమే మంచిది☛ విలువైన వస్తువులను జాగ్రత్తపరచుకోవాలి☛ వాతావరణం ప్రతికూలంగా ఉంటే మరింత జాగ్రత్త అవసరం
News November 4, 2025