News August 29, 2024
ప్రకాశం: గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల

ప్రకాశం జిల్లాలోని గ్రామ పంచాయతీలకు రూ.37.94 కోట్ల ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యాయి. జిల్లాలో 729 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలోని మొదటి వాయిదా కింద విడుదల చేయాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.37.94 కోట్లను కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. గ్రామాల్లో అత్యవసర పనులు చేపట్టేందుకు పంచాయతీ అధికారులు ఈ నిధులను ఉపయోగించాలని ప్రభుత్వం ఆదేశించింది.
Similar News
News February 12, 2025
నిర్లక్ష్యం వహిస్తే సహించబోను: ప్రకాశం కలెక్టర్

బాలలకు ఆధార్ కార్డుల జారీ కోసం ప్రత్యేక శిబిరాల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించబోనని కలెక్టర్ అన్సారియా స్పష్టం చేశారు. శిశు సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బందితో బుధవారం ఒంగోలులోని కలెక్టరేట్‌లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శిబిరాల తీరు, పురోగతిపై సమక్షించారు. పనితీరు పేలవంగా ఉన్న సిబ్బందికి షోకజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులకు తెలిపారు.
News February 12, 2025
గురుకుల విద్యార్థులను అభినందించిన మంత్రి

జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్‌డ్ పరీక్షకు అర్హత సాధించిన బి.ఆర్ అంబేడ్కర్ గురుకులాల విద్యార్థులకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖమంత్రి బాలవీరాంజనేయస్వామి అభినందనలు తెలిపారు. కర్నూలు జిల్లా చిన్న టేకూరు, ఎన్టీఆర్ జిల్లా ఈడుపుగల్లు, గుంటూరు జిల్లా అడవి తక్కెళ్లపాడులలోని గురుకుల పాఠశాలల నుంచి మొత్తం 190 మంది పరీక్షకు హాజరుకాగా 110మంది అడ్వాన్స్‌డ్ పరీక్షకు అర్హత సాధించారు. వారిని మంత్రి స్వామి అభినందించారు
News February 12, 2025
సంతనూతలపాడులో అధికారులపై కలెక్టర్ ఆగ్రహం

సంతనూతలపాడు మండలంలోని ఎం.వేములపాడు గ్రామంలో జరుగుతున్న భూముల రీసర్వేను కలెక్టర్ తమీమ్ అన్సారియా మంగళవారం పరిశీలించారు. ఎంతమంది రీ సర్వే చేస్తున్నారని కలెక్టర్ అధికారులను ప్రశ్నించగా.. 5 టీములు భూముల రీ సర్వేలో పాల్గొంటున్నాయని వారు వివరించారు. వెంటనే రైతులకు ఫోన్ చేసిన కలెక్టర్ ఒక్క టీము మాత్రమే పాల్గొందని తెలుసుకొని 4 టీముల అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించినట్లు సామాచారం.