News April 29, 2024
ప్రకాశం: చంద్రబాబు పర్యటనలో మార్పు

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఈనెల 30న యర్రగొండపాలెంలో చంద్రబాబు నాయుడు పర్యటించేలా షెడ్యూల్ ఖరారయింది. అదే రోజు లోకేశ్, బాలకృష్ణ పర్యటిస్తుండటంతో పర్యటన వాయిదా పడినట్లు టీడీపీ నాయకులు తెలిపారు. మే 3, 4వ తేదీల్లో జిల్లాలో పర్యటిస్తున్నట్లుగా తెలిపారు. 3న మార్కాపురం, 4న దర్శిలో నిర్వహించనున్న బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని తెలిపారు.
Similar News
News October 31, 2025
నవంబర్ 30 వరకు యాక్ట్ 30 అమలు: DSP

ప్రకాశం జిల్లాలో నవంబర్ 1 నుంచి 30 వరకు యాక్ట్ 30 అమల్లో ఉంటుందని ఒంగోలు DSP రాయపాటి శ్రీనివాసరావు శుక్రవారం వెల్లడించారు. అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణ నిమిత్తం పోలీస్ శాఖ తీసుకున్న నిర్ణయానికి అందరూ సహకరించాలని కోరారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
News October 31, 2025
ఒంగోలులో కారు ఢీకొని వ్యక్తి మృతి

ఒంగోలులోని త్రోవగుంట బృందావనం కల్యాణ మండపం వద్ద కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతుడు కర్నాటి వెంకటసుబ్బారెడ్డిగా నిర్ధారించారు. ప్రమాదం జరిగిన కోణపై పోలీసులు వివరాలు ఆరా తీస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News October 31, 2025
ప్రకాశం జిల్లాలో నేడు పాఠశాలలు పునః ప్రారంభం

తుఫాన్ ప్రభావం తగ్గడంతో నేటి నుంచి యధావిధిగా పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. వరుసగా 4 రోజులు తుఫాను సెలవుల అనంతరం నేడు బడిగంట మోగనుంది. ఈ దశలో విద్యార్థుల భద్రతకోసం ఉపాధ్యాయులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని DEO కిరణ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. పాఠశాల పరిసరాల్లో చెట్ల కొమ్మలు, కరెంట్ వైర్లు, తడిసిన గోడలు వంటి అంశాలను పరిశీలించి విద్యార్థుల పట్ల జాగ్రత్త వహించాలని ఆయన కోరారు.


