News December 23, 2024
ప్రకాశం జట్టుకు ప్రథమ స్థానం

ఈనెల 21వ తేదీ నుంచి తిరుపతి జిల్లా పుత్తూరులో జరిగిన అండర్-19 రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఖోఖో పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లా బాలుర జట్టు ప్రథమ స్థానం సాధించినట్లు ఖోఖో రాష్ట్ర కార్యదర్శి మేకల సీతారాంరెడ్డి ఆదివారం తెలిపారు. ఈ జట్టును చంద్రగిరి ఎమ్మెల్యే భాను ప్రకాశ్ అభినందించారన్నారు. ఈ జట్టు బాపట్ల జిల్లా పంగులూరులో 20 రోజులు పాటు శిక్షణ తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
Similar News
News February 22, 2026
ప్రకాశం: ఆ ప్రాంతాల్లో 144 సెక్షన్

ఈ నెల 23 నుంచి ఇంటర్మీడియేట్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రకాశం జిల్లాలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా SP హర్షవర్ధన్ రాజు తెలిపారు. జిల్లాలోని 79 పరీక్షా కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. పరీక్షలు జరుగుతున్న సమయంలో జిరాక్స్ సెంటర్లు తప్పనిసరిగా మూసివేయాలని హెచ్చరికలు జారీ చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
News February 22, 2026
సింగరాయకొండ వద్ద ఘోర ప్రమాదం

ప్రకాశం జిల్లా సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో కందుకూరు ఫ్లైఓవర్ మీద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఒంగోలు వైపు వెళ్తున్న కంటైనర్ బాక్స్ లారీని పుచ్చకాయ లోడ్‌తో వెళ్తున్న మినీ వ్యాన్ వెనుక వైపు నుంచి ఢీకొంది. దీంతో మినీ వ్యాన్ డ్రైవర్ అక్కడే మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున జరిగింది. మృతుడు గుంటూరు జిల్లా తెనాలి పరిధిలోని నందివెలుగుకి చెందిన వ్యక్తిగా గుర్తించారు.
News February 22, 2026
ప్రకాశం: ‘నేడు కూడా బిల్లులు చెల్లించవచ్చు’

ప్రకాశం జిల్లాలో ఆదివారం అయినా విద్యుత్ బిల్లు కౌంటర్లు తెరిచి ఉంటాయని SE కట్టా వెంకటేశ్వర్లు తెలిపారు. వినియోగదారుల సౌకర్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని అన్ని కౌంటర్లు పనిచేస్తాయని వెల్లడించారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఆన్‌లైన్‌లో కూడా బిల్లులు చెల్లించవచ్చని చెప్పారు.


