News September 24, 2024
ప్రకాశం జిల్లాకు అధిక ప్రాధాన్యత
రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించిన నామినేటెడ్ పోస్టుల జాబితాలో ప్రకాశం జిల్లాకు ప్రాధాన్యం కనిపించింది. జిల్లా నుంచి ఏకంగా ముగ్గురికి నామినేటెడ్ పదవులు వరించాయి. తొలి జాబితాలో ఏ జిల్లాలోనూ ముగ్గురికి పదవులు దక్కలేదు. దామచర్ల సత్యకు AP మారిటైమ్ బోర్డ్ ఛైర్మన్, 20 సూత్రాల ఫార్ములా ఛైర్మన్‌గా లంకా దినకర్, నూకసాని బాలాజీకి AP టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పదవి వరించిన విషయం తెలిసిందే.
Similar News
News October 9, 2024
మార్కాపురం జిల్లా ఇప్పుడే కాదు: చంద్రబాబు
కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 30 జిల్లాలుగా మారుస్తామనే ప్రచారంలో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. మదనపల్లె, మార్కాపురం జిల్లాలపై తాము హామీలు ఇచ్చామన్నారు. ఆయా జిల్లాలు కూడా ఇప్పుడే ఏర్పాటు చేయబోమని తెలిపారు. ఎన్నికలకు ముందే పుంగనూరు, మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరుతో కలిపి మదనపల్లె జిల్లా ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
News October 9, 2024
ఇండోర్ హాల్‌ను ప్రారంభించిన ప్రకాశం ఎస్పీ
ఒంగోలు పోలీస్ డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్‌లోని పోలీసు జూడో క్లస్టర్‌లో తైక్వాండో, కరాటే, పెంచాక్ సిలాట్ గేమ్స్ కోసం, నూతనంగా ఏర్పాటు చేసిన ఇన్‌డోర్ హాల్‌ను జిల్లా ఎస్పీ దామోదర్ ప్రారంభించారు. ఈ క్యాంప్‌కు వివిధ జిల్లాల నుంచి పోలీసు క్రీడాకారులు వచ్చి శిక్షణ తీసుకుంటున్నారు. శిక్షణ నిమిత్తం కావాల్సిన వసతుల గురించి పోలీస్ క్రీడాకారులను అడిగి ఎస్పీ తెలుసుకున్నారు.
News October 9, 2024
పార్వతమ్మకు నివాళులర్పించిన మంత్రి స్వామి
ఒంగోలు మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీమతి మాగుంట పార్వతమ్మ దశదినం సందర్భంగా.. బుధవారం నెల్లూరులోని మాగుంట నివాసంలో పార్వతమ్మ చిత్రపటానికి మంత్రి స్వామి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పార్వతమ్మ ఒంగోలు పార్లమెంట్ పరిధిలో చేసిన అభివృద్ధి పనులు, ఆమె జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.