News March 22, 2024
ప్రకాశం జిల్లాకు చంద్రబాబు రాక

సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఈనెల 31న జిల్లాకు రానున్నారు. కొండపి నియోజకవర్గంలో నిర్వహించనున్న ప్రజాగళం సభలో ఆయన పాల్గొంటారు. ఈ సభకు విద్యావంతులు, ఐటీ ఉద్యోగులు, న్యాయవాదులు, వివిధ రంగాలకు చెందిన నిపుణులను ఆహ్వానిస్తున్నట్లు టీడీపీ నాయకులు వెల్లడించారు. అనంతరం మార్కాపురంలో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారని వివరించారు.
Similar News
News November 24, 2025
రాచర్ల: పొలంలో నీళ్లు పెడుతుండగా.. కరెంట్ షాక్కి గురై..

రాచర్ల మండలం ఆకవీడుకు చెందిన చిట్టిబాబు చిన్న కుమారుడు రాజేశ్ విద్యుత్ షాక్కు గురై ఆదివారం మృతి చెందారు. మొక్కజొన్న పొలంలో నీళ్లు పెడుతుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్కు గురై మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో కుటుంబం శోకసముద్రంలో మునిగింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.
News November 24, 2025
ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీగా బాపట్ల ఎస్పీ

ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీగా బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వర్ నియమించబడ్డారు. ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు డిసెంబర్ రెండు వరకు సెలవుల్లో ఉండడంతో, ప్రభుత్వం ఈ మేరకు బాపట్ల ఎస్పీని ఇన్ఛార్జ్గా నియమించింది. దీనితో జిల్లా బాధ్యతలను బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వర్ చేపట్టారు. డిసెంబర్ మూడో తేదీన ఎస్పీ హర్షవర్ధన్ రాజు మళ్లీ విధుల్లో చేరనున్నారు.