News March 22, 2024

ప్రకాశం జిల్లాకు చంద్రబాబు రాక

image

సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఈనెల 31న జిల్లాకు రానున్నారు. కొండపి నియోజకవర్గంలో నిర్వహించనున్న ప్రజాగళం సభలో ఆయన పాల్గొంటారు. ఈ సభకు విద్యావంతులు, ఐటీ ఉద్యోగులు, న్యాయవాదులు, వివిధ రంగాలకు చెందిన నిపుణులను ఆహ్వానిస్తున్నట్లు టీడీపీ నాయకులు వెల్లడించారు. అనంతరం మార్కాపురంలో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారని వివరించారు.

Similar News

News March 10, 2026

కొండేపి: పదో తరగతి విద్యార్థుల్లో ధైర్యం నింపిన మంత్రి

image

పదో తరగతి పరీక్షల నేపథ్యంలో మంత్రి స్వామి మంగళవారం విద్యార్థులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన తన పదో తరగతి పరీక్షల అనుభవాలను పంచుకుంటూ విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థులు ఎటువంటి ఆందోళన చెందకుండా, ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరుకావాలని సూచించారు. ఒత్తిడిని జయించి ప్రశాంతంగా రాయాలని పలు కీలక సూచనలు చేశారు.

News March 10, 2026

మార్కాపురం మున్సిపాలిటీలో ఉద్యోగాల పేరిట రూ.కోటి టోకరా..?

image

మార్కాపురం మున్సిపాలిటీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఓ వ్యక్తి నమ్మబలికి రూ.కోటికి పైగా వసూలు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పారిశుద్ధ్య కార్మికులుగా చేర్పించడానికి ఒక్కొక్కరి వద్ద రూ.2 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలిసింది. గత ఏడాదిగా నియమకాలు లేకుండానే పనులు చేయించుకుంటున్నట్లు తెలిసింది. 15 నెలలు అవుతున్నా ఉద్యోగం రాకపోవడంతో తమ డబ్బులు వెనకకు ఇవ్వాలని బాధితులు అడగడంతో ఈ వ్యవహారం బయటపడింది.

News March 10, 2026

ప్రకాశం జిల్లాలో మిస్సింగ్ కేసులపై దృష్టి

image

మిస్సింగ్ కేసులు, NBW, మహిళలకు సంబంధించిన కేసులు, రోడ్డు ప్రమాదాల నివారణ, అలాగే స్వర్ణాంధ్ర విజన్‌కి పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ వంటి అంశాలపై సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో SP హర్షవర్ధన్ రాజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై అధికారులను అరా తీశారు. మిస్సింగ్ కేసుల ఛేదనకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, చిన్నారులు, మహిళల అదృశ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.