News October 7, 2024
ప్రకాశం జిల్లాకు మూడో స్థానం
నెల్లూరులో రెండు రోజులుగా జరుగుతున్న ఆట్యా పాట్యా 9వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ ఆటలు పోటీల్లో ప్రకాశం జిల్లా జట్టు మూడో స్థానాన్ని సాధించింది. విజేతలుగా నిలిచిన క్రీడాకారులను పలువురు అభినందించారు. ప్రకాశం జిల్లా జట్లు మూడో స్థానాన్ని సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని ఆట్యా పాట్యా ప్రకాశం జిల్లా అధ్యక్షుడు నంబూరి శ్రీనివాసులు అన్నారు. భవిష్యత్తులో కూడా మంచి పథకాలు సాధించాలని కోరారు.
Similar News
News November 4, 2024
5న ప్రకాశం జిల్లా వైసీపీ విస్తృత స్థాయి సమావేశం
ఒంగోలులోని వైసీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద రెడ్డి చెప్పారు. సమావేశానికి పార్టీ జిల్లా రీజనల్ కో ఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు, ఒంగోలు పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొంటారన్నారు. జిల్లాలోని నియోజకవర్గ ఇన్‌ఛార్జీలు, అన్ని కమిటీలతో సమావేశం నిర్వహిస్తారని పేర్కొన్నారు.
News November 3, 2024
అద్దంకి: రెండో అంతస్తు నుంచి జారిపడి వ్యక్తి మృతి
అద్దంకి పట్టణంలో రంగారావు ఆసుపత్రిలో రెండో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు పవన్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి కింద పడి మృతి చెందిన ఘటన ఆదివారం జరిగింది. ఆసుపత్రిలో మరమ్మతుల నిమిత్తం కూలి పనికి వెళ్లిన అతడు ప్రమాదవశాత్తు కిందపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్సై ఖాదర్ బాషా ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు.
News November 3, 2024
త్రిపురాంతకేశ్వరాలయంలో సుమన్ పూజలు
త్రిపురాంతకం మండలంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ త్రిపురాంతకేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం సినీ హీరో సమన్ పూజలు చేశారు. శ్రీమత్ బాల త్రిపుర సుందరీ దేవి ఉభయ దేవాలయాలను ఆయన దర్శించుకున్నారు. ఆలయాల ఈవో ఈదుల చెన్నకేశవరెడ్డి ఆయనకు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి అమ్మవారి ఆశీస్సులను అందించారు.