News October 13, 2024
ప్రకాశం జిల్లాకు వర్ష సూచన.. కాల్ సెంటర్ ఏర్పాటు

దక్షిణ కోస్తా ప్రాంతంలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా అధికారులను కలెక్టర్ తమీమ్ అన్సారియా అప్రమత్తం చేశారు. సుమారు రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో.. ప్రత్యేక కంట్రోల్ రూమ్ సైతం ఏర్పాటు చేశారు. ఎక్కడైనా వరద బీభత్సం వల్ల సాయం కావలసినవారు 1077 టోల్ ఫ్రీ నెంబర్‌కు సమాచారం అందించాలన్నారు.
Similar News
News July 9, 2025
బీఎల్ఓల భాద్యతే కీలకం: ఇన్‌ఛార్జి కలెక్టర్

పారదర్శకమైన ఓటరు జాబితాను రూపొందించడంలో బీఎల్ఓల భాద్యతలు కీలకమని ఇన్ఛార్జి కలెక్టర్ గోపాలకృష్ణ తెలిపారు. ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో మంగళవారం బీఎల్ఓల శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం జారీచేసిన మార్గదర్శకాలపై పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించుకోవాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా భాద్యతలు నిర్వర్తించాలన్నారు.
News July 8, 2025
‘ఇళ్ల స్థలాలకు అర్హుల వివరాలు ఆన్‌లైన్ చేయాలి’

ఇంటి నివేశన స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. మంగళవారం విజయవాడ సీసీఎల్ఏ కార్యాలయం నుంచి ఇళ్ల స్థలాలపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రకాశం జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ గోపాలకృష్ణ పాల్గొన్నారు. ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి మాట్లాడుతూ.. అర్హులైన వారి వివరాలు ఆన్లైన్ చేసి, ఆ తర్వాత స్థలాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
News July 8, 2025
తల్లులకు పాదాభివందనం చేయించాలి: ఇన్‌ఛార్జ్ కలెక్టర్

ప్రకాశం జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈనెల 10వ తేదీన మెగా పేరెంట్స్ మీటింగ్ సందర్భంగా తల్లులకు విద్యార్థుల చేత పాదాభివందనం చేయించాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గోపాలకృష్ణ అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో కార్యక్రమం నిర్వహణపై ఆయన మాట్లాడుతూ.. ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో ఉదయం 9 నుంచి మధ్యహ్నం 12.30 గంటల వరకు, ఉన్నత పాఠశాలల్లో 9 నుంచి ఒంటి గంట వరకు కార్యక్రమం నిర్వహించాలన్నారు.