News April 25, 2024

ప్రకాశం జిల్లాకు సీఎం జగన్ రాక

image

సీఎం జగన్ ఈనెల 28 నుంచి రోజూ 3 నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఈక్రమంలో ఆయన ఈ నెల 28న కందుకూరులో. 30న కొండపిలో పర్యటించనున్నారు. 28వ తేదీ మధ్యాహ్నం 3:00 గంటలకు వెంకటగిరిలో జరిగే సభలో సీఎం పాల్గొంటారు. 30వ తేదీ ఉదయం 10:00 గంటలకు కొండపిలో పర్యటించనున్నారు. సభా ప్రాంగణాల వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 25, 2026

ఆ సమయంలో ఫ్లోరైడ్‌తో బాధపడుతున్నారు: CM

image

30 ఏళ్ల కిందట మార్కాపురం వచ్చానని, ఆ సమయంలో మీరు కృష్ణా జలాలు ఇవ్వాలని కోరగా.. ఆనాడు హామీ ఇచ్చి, భూమి పూజ చేశాను అని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. వెలిగొండ పూర్తిచేసి జాతికి అంకితం చేసే అవకాశం దేవుడు తనకు ఇచ్చాడని సీఎం తెలిపారు. 2014 – 19లో నేరుగా ప్రాజెక్టు దగ్గర వచ్చి పనులను పరిగెత్తించానని, కానీ 2019 – 24 చీకటి రోజులు రావడంతో పనులు ఆటకెక్కాయని చెప్పారు.

News February 25, 2026

వెలిగొండ పూర్తయితే 3 జిల్లాలకు ప్రయోజనం

image

కడప, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సాగు, తాగునీరు అందించేందుకు వెలిగొండ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటుంది. 43.5 TMCల వరద నీటిని నల్లమల్లసాగర్ రిజర్వాయర్ ద్వారా మళ్లించి 19.2 కిలోమీటర్ల పొడవైన టన్నెల్స్‌తో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 15 లక్షల మందికి తాగునీరు అందించేలా రూపొందించారు. ఈ ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం వేగవంతం చేసి 2026కి పూర్తిచేస్తామని CM చంద్రబాబు పూనుకున్నారు.

News February 25, 2026

మార్కాపురం జిల్లా అభివృద్ధికి CM వరాలు కురిపిస్తారా..?

image

మార్కాపురం జిల్లా ఏర్పడిన తర్వాత మొదటిసారి CM చంద్రబాబు వస్తున్న నేపథ్యంలో భారీగా ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జిల్లా ఏర్పాటుచేయగా వెలుగొండ ప్రాజెక్టు పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అయితే సీఎం జిల్లా అభివృద్ధికి ఎలాంటి వరాలు కురిపిస్తారోనని నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.