News January 4, 2025
ప్రకాశం జిల్లాలో ఎయిర్‌పోర్టుపై CM కీలక ప్రకటన
ప్రకాశం జిల్లా దొనకొండలో బ్రిటీష్ కాలంలోనే ఎయిర్ ఫోర్ట్ నిర్మించిన విషయం తెలిసిందే. ఇది ఎప్పుడో మూతపడింది. ఈ నేపథ్యంలో ఒంగోలుకు దగ్గరలోని కొత్తపట్నం మండలం అల్లూరు, ఆలూరు గ్రామాల మధ్య ఎయిర్‌పోర్ట్ నిర్మించడానికి ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు ఆ ఏరియాలో 723 ఎకరాలను గుర్తించినట్లు సీఎం చంద్రబాబు నిన్నటి సమీక్షలో వెల్లడించారు. అన్నీ కుదిరితే త్వరలోనే ఎయిర్‌పోర్టు పనులపై ముందడుగు పడే అవకాశం ఉంది.
Similar News
News January 16, 2025
అధికారులకు ప్రకాశం కలెక్టర్ కీలక ఆదేశాలు
రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. అలాగే జిల్లాలో రహదారుల భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రోడ్డు భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
News January 15, 2025
అద్దంకి: తెప్పోత్సవానికి భారీ బందోబస్తు
అద్దంకి, సింగరకొండపాలెం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో నేడు తెప్పోత్సవానికి నిర్వహిస్తున్నారు. సందర్భంగా ఆలయాన్ని అధిక సంఖ్యలో భక్తులు సందర్శించే అవకాశం ఉండటంతో.. అద్దంకి టౌన్, రూరల్ సీఐలు కృష్ణయ్య, మల్లికార్జున్ రావు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందికి తగు సూచనలు సలహాలు అందించారు. కార్యక్రమంలో మేదరమెట్ల, కొరిశపాడు, అద్దంకి SIలు మహమ్మద్ రఫీ, సురేశ్, ఖాదర్ బాషా, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
News January 15, 2025
చీరాల: గంట వ్యవధిలో గుండెపోటుతో అన్నదమ్ముల మృతి
చీరాల గొల్లపాలెంలో బుధవారం తీవ్ర విషాద ఘటన జరిగింది. గంటల వ్యవధిలో అన్నదమ్ములు గుండెపోటుతో మృతిచెందారు. గొల్లపాలెంకు చెందిన గొల్లప్రోలు గంగాధర్ (40) గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబసభ్యులు అతడిని చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అయితే అప్పటికే గంగాధర్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అన్నయ్య మృతి తట్టుకోలేని తమ్ముడు గోపి( 33) అదే వైద్యశాలలో గుండెపోటుతో మరణించాడు.