News June 17, 2024

ప్రకాశం జిల్లాలో కొనసాగుతున్న రాజీనామాలు

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీకి ఘోర ఓటమి ఎదురైంది. ఈక్రమంలో ఆ పార్టీకి చెందిన పలువురు తమ నామినేటెడ్ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. తాజాగా దర్శి మండలంలో 9 మంది ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లు రాజీనామా చేశారు. తుమ్మెదలపాడు, తూర్పువీరాయపాలెం, బొట్లపాలెం, రాజంపల్లి, సామంతపూడి, తానంచింతల, బండి వెలిగండ్ల, చందలూరు, త్రిపురసుందరీపురం గ్రామాలకు చెందిన ఫీల్డ్ అసిస్టెంట్లు విధుల నుంచి తప్పుకొన్నారు.

Similar News

News December 6, 2025

మోసపోవద్దు తస్మాత్ జాగ్రత్త: ప్రకాశం పోలీస్

image

వాట్సాప్‌లకు వచ్చే ఏపీకే ఫైల్స్ క్లిక్ చేసి మోసపోవద్దని ప్రకాశం పోలీసులు తాజాగా హెచ్చరించారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు సైబర్ నేరాలపై పోలీసులు విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం ఏపీకే ఫైల్స్ జోలికి వెళ్లవద్దని పోలీసులు సోషల్ మీడియా ద్వారా ఒక ప్రకటన చేశారు. బ్యాంక్, అధికారుల పేర్లతో వచ్చే ఏపీకే ఫైల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, వాటిని క్లిక్ చేయవద్దని సూచించారు.

News December 5, 2025

ప్రకాశం: నెలకు రూ.2 లక్షల శాలరీ.. డోంట్ మిస్.!

image

అబుదాబి, దుబాయ్ ప్రాంతాల్లో హోమ్ కేర్, నర్స్ ఉద్యోగావకాశాలు ఉన్నాయని, జిల్లాలోని అర్హులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్కిల్ డెవలప్మెంట్ జిల్లా అధికారి రవితేజ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. 21 నుంచి 40 సంవత్సరాలు గల మహిళలు అర్హులని, నెలకు రూ.2లక్షల వరకు వేతనం ఉంటుందన్నారు. ఈనెల 7వ తేదీలోగా ప్రకాశం జిల్లా నైపుణ్యం వెబ్సైట్‌‌లో పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు.

News December 5, 2025

జిల్లాకు ‘ప్రకాశం’ అని నామకరణం చేసింది ఈ రోజే!

image

ఆంధ్ర రాష్ట్ర అవతరణ అనంతరం ఒంగోలు జిల్లా కాస్త ప్రకాశం జిల్లాగా మారింది నేడే. 1970లో జిల్లా ఏర్పడగా, 1972 డిసెంబర్ 5న స్వాతంత్ర్య సమరయోధులు, ఆంధ్ర రాష్ట్ర తొలి CM టంగుటూరి ప్రకాశం పంతులు పేరున జిల్లాకు నామకరణం చేశారు. నాగులుప్పలపాడు(M) వినోదరాయునిపాలెంలో జన్మించిన ప్రకాశం పంతులు స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆ మహనీయుడి పేరున ఏర్పడ్డ జిల్లా వాసులుగా గర్విద్దాం.. ఆయన సేవలను కొనియాడుదాం!