News July 11, 2024
ప్రకాశం జిల్లాలో ఖమ్మం బాలిక ఆత్మహత్య

ప్రకాశం జిల్లా మేదరమెట్లలో బుధవారం ఖమ్మం జిల్లాకు చెందిన బాలిక(14) చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కొద్దిరోజుల క్రితం కూలీ పనుల నిమిత్తం ప్రకాశం జిల్లాలో బంధువుల వద్ద ఉంటూ, పనికి వెళ్తుంది. ఈక్రమంలో బుధవారం అర్ధరాత్రి బాలిక కనిపించకపోవడంతో పరిసర ప్రాంతాలు వెతకగా చెట్టుకు ఉరేసుకుని కనిపించిందని బాలిక తండ్రి దేవయ్య తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 5, 2025
‘పకడ్బందీగా పోలింగ్ సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి’

ఖమ్మం: మొదటి విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ సిబ్బంది కేటాయింపు కొరకు రెండో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ పకడ్బందీగా పూర్తి చేసామని సాధారణ ఎన్నికల పరిశీలకులు ఖర్తడే కాళీచరణ్ సుదామరావు అన్నారు. శుక్రవారం సాధారణ ఎన్నికల పరిశీలకులు, కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ అనుదీప్ ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు. మొదటి విడతకు మొత్తం 1582 బృందాలను సిద్ధం చేశామని పేర్కొన్నారు.
News December 5, 2025
ఖమ్మం మార్కెట్కు రేపు, ఎల్లుండి సెలవు

ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు శని, ఆదివారాలు (డిసెంబర్ 6, 7) వారంతపు సెలవుల కారణంగా మార్కెట్ శాఖ అధికారులు సెలవు ప్రకటించారు. ఈ రెండు రోజుల్లో మార్కెట్లో క్రయవిక్రయాలు జరగవని తెలిపారు. తిరిగి ఈ నెల8వ తేదీ (సోమవారం) నుంచి క్రయవిక్రయాలు యథావిధిగా జరుగుతాయని అన్నారు. ఈ విషయాన్ని రైతులు గమనించాలని కోరారు.
News December 5, 2025
స్వదేశీ రక్షణ పరికరాల ఉత్పత్తిని పెంచేందుకు చర్యలెక్కడ?: ఎంపీ

స్వదేశీ రక్షణ పరికరాల ఉత్పత్తిని పెంచేందుకు ఎలాంటి కార్యాచరణను ఆచరిస్తోందని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి లోక్ సభలో కేంద్రాన్ని ప్రశ్నించారు. దేశీయ తయారీదారులకు సబ్సిడీ, ప్రోత్సాహకాల గురించి, రక్షణ సముపార్జన ప్రక్రియకు కేంద్రం ఏమైనా సవరణలు చేసిందా? అడిగారు. దీనిపై కేంద్ర మంత్రి సంజయ్ సేథ్ స్పందిస్తూ.. స్వదేశీ ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సమాధానం ఇచ్చారు.


