News October 28, 2024

ప్రకాశం జిల్లాలో దారుణం

image

సొంత చెల్లినే గర్భిణిని చేసిన దుర్మార్గపు ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. తాళ్లూరు మండలానికి చెందిన బాలిక(13) 8వ తరగతి చదువుతోంది. ఇంటికి సమీపంలోని ఓ బాలుడితో ప్రేమలో పడింది. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పేస్తానంటూ బెదిరించి బాలిక సొంత సోదరుడు లైంగిక దాడి చేశాడు. ఆమె గర్భం దాల్చింది. ఓRMP సాయంతో గర్భం తొలగించే ప్రయత్నం చేయగా పరిస్థితి సీరియస్ అయ్యింది. ఒంగోలు ఆసుపత్రికి రావడంతో అసలు విషయం తెలిసింది.

Similar News

News December 1, 2025

నేడు ప్రకాశం SP మీకోసం రద్దు.!

image

ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించాల్సిన ఎస్పీ మీకోసం కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా ఇన్‌ఛార్జ్ SP ఉమామహేశ్వరరావు తెలిపారు. తుఫాన్ నేపథ్యంలో వాతావరణశాఖ జారీచేసిన హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని, ఈ కార్యక్రమాన్ని రద్దుచేయడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని కోరారు.

News November 30, 2025

తుఫాను ప్రభావం పడే 14 మండలాలు ఇవే.!

image

ప్రకాశం జిల్లాలోని 14 మండలాలపై తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని కలెక్టర్ రాజబాబు అన్నారు. కనిగిరి, కొండపి, కొత్తపట్నం, మర్రిపూడి, మద్దిపాడు, నాగులుప్పలపాడు, ఒంగోలు, పామూరు, పీసీపల్లి, పొన్నలూరు, సంతనూతలపాడు, టంగుటూరు, సింగరాయకొండ, జరుగుమల్లి మండలాల్లో తీవ్రమైన గాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నందున పరిస్థితిని పరిశీలించి, అవసరమైన చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు.