News February 19, 2025
ప్రకాశం జిల్లాలో నేటి నుంచి ఆధార్ క్యాంపులు

ప్రకాశం జిల్లా పరిధిలో ఇవాళ్టి నుంచి ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నారు. ప్రతి మండలంలో సెలక్ట్ చేసిన సచివాలయాల్లో ఆధార్ సేవలు అందిస్తారు. కొత్తగా ఆధార్ కార్డు నమోదు, పాత కార్డులో వివరాల అప్డేట్, మొబైల్ లింకింగ్, చిన్న పిల్లల ఆధార్ నమోదు తదితర సేవలు అందుబాటులో ఉన్నాయి. మీకు దగ్గరలోని సచివాలయాలను సంప్రదిస్తే.. ఏ సచివాలయంలో ఆధార్ సేవలు అందిస్తారో మీకు చెబుతారు.
Similar News
News September 17, 2025
ప్రకాశం: ఐటీఐ పాసైన విద్యార్థులకు గుడ్ న్యూస్

జిల్లాలో ఐటీఐ పాసైన విద్యార్థులకు జిల్లా ఐటీఐ కన్వీనర్ ప్రసాద్ బాబు శుభవార్త చెప్పారు. జిల్లాలోని ఆర్టీసీ డిపోలలో అప్రెంటిస్ శిక్షణలో చేరేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. వచ్చే నెల 4వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని ప్రకటించారు. జిల్లాలో మొత్తం 54 ఖాళీలు ఉన్నాయన్నారు.
News September 17, 2025
ఒంగోలులో పిడుగుపాటు.. పదేళ్ల బాలుడి మృతి.!

ఒంగోలులో పిడుగుపాటుకు గురై పదేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన బుధవారం జరిగింది. బుధవారం తెల్లవారుజామున ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో ఒంగోలు నగరం దద్దరిల్లింది. ఈ నేపథ్యంలోనే ఒంగోలు శివారు ప్రాంతంలో పదేళ్ల బాలుడు ఇంటి వద్ద ఉన్న క్రమంలో ఒక్కసారిగా పిడుగు పడినట్లు సమాచారం. దీంతో బాలుడు మృతి చెందగా ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతి చెందిన బాలుడు కంకణాల చందుగా తెలుస్తోంది.
News September 17, 2025
S.కొండ: ఫోక్సో కేసుపై DEO కార్యాలయంలో చర్చ

ఒంగోలు DEO కార్యాలయంలో సింగరాయకొండలో జరిగిన ఫోక్సో కేసు అంశంపై మంగళవారం చర్చ జరిగింది. ఈ సమావేశంలో డీఈఓ కిరణ్ కుమార్, డిప్యూటీ ఈవో చంద్రమౌళీశ్వరు పాల్గొన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పాఠశాలల్లో జరిగిన లైంగిక వేధింపుల కేసులను 164 స్టేట్మెంట్ ఆధారంగా తప్పుడు రీతిలో రిఫర్ చేస్తున్న పరిస్థితిపై చర్చ సాగింది. దీనిపై తగిన చర్యలు తీసుకునేలా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తానని డీఈఓ తెలిపారు.