News November 9, 2024
ప్రకాశం జిల్లాలో నేడు ప్రత్యేక శిబిరాలు
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఉన్న పోలింగ్ కేంద్రాలలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్& జిల్లా ఎన్నికల అధికారిణి తమీమ్ అన్సారియా ప్రకటన విడుదల చేశారు. ఈనెల 9, 10, 23, 24వ తేదీల్లో ఉదయం 10గం. నుంచి సాయంత్రం 5గం. వరకు బూత్ లెవల్ అధికారులు అందుబాటులో ఉంటారని చెప్పారు. అర్హులైన వారి నుంచి ఫారం-6,7,8 ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారని పేర్కొన్నారు.
Similar News
News December 11, 2024
రియల్ హీరో సుబ్బయ్యకు సెల్యూట్: వైయస్ జగన్
జమ్మూలో విధి నిర్వహణలో ప్రాణాలు వదిలిన ప్రకాశం జిల్లా రావిపాడుకు చెందిన ఆర్మీ జవాన్ వరికుంట్ల సుబ్బయ్య రియల్ హీరో అని మాజీ సీఎం జగన్ కొనియాడారు. సుబ్బయ్య ల్యాండ్‌మైన్ ఉచ్చు నుంచి తనతోటి జవాన్‌లు 30 మందిని కాపాడడం స్ఫూర్తిదాయకమని అన్నారు. తన కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ప్రసాదించాలని, తన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ‘X’లో పోస్టు చేశారు.
News December 11, 2024
లండన్‌లో బూదవాడకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దుర్మరణం
లండన్‌లో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చీమకుర్తి మండలం బూదవాడకు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ పీ చిరంజీవి(32) మృతిచెందారు. అతను కారులో వెళుతుండగా డివైడర్‌ను ఢీకొట్టడంతో అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో చిరంజీవి అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురికి గాయాలయ్యాయి. ఈ విషయం తెలియడంతో అతని తల్లిదండ్రులు, బంధువులు శోకసముద్రంలో మునిగిపోయారు. మృతదేహం ఇండియాకు రావాల్సి ఉంది.
News December 11, 2024
జవాన్ మృతిపై స్పందించిన మంత్రి అనిత
జమ్మూలో ల్యాండ్ మైన్ పేలి వీరమరణం పొందిన కంభం మండలం <<14838717>>రావిపాడుకు చెందిన జవాన్ <<>>వరికుంట్ల సుబ్బయ్యకు బుధవారం మంత్రి అనిత సంతాపం తెలిపారు. సైన్యంలో 23 ఏళ్లు సేవలందించిన సుబ్బయ్య ప్రాణాలు కోల్పోయిన వార్త కలచివేసిందన్నారు. కానీ, మృత్యువు చేరువైందని తెలిసినా గో బ్యాక్ అంటూ సహచర జవాన్లను అప్రమత్తం చేసి తనువు చాలించారని, జవాన్ సుబ్బయ్య సాహసం ఆదర్శమని మంత్రి అనిత తన X ఖాతాలో పోస్ట్ చేశారు.