News January 8, 2025
ప్రకాశం జిల్లాలో నేడు మోదీ ప్రారంభించేవి ఇవే..!
ప్రకాశం జిల్లాలో వివిధ పనులకు ప్రధాని మోదీ విశాఖ నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేస్తారు. దోర్నాల-కుంట జంక్షన్(రూ.245 కోట్లు), వెలిగోడు-నంద్యాల(రూ.601 కోట్లు) రోడ్డు విస్తరణ పనులకు శ్రీకారం చుడతారు. అలాగే రూ.108 కోట్లతో గిద్దలూరు-దిగువమెట్ట డబ్లింగ్ పనులకు భూమి పూజ చేస్తారు. రూ.907 కోట్లతో పూర్తి చేసుకున్న 6 వరుసల చిలకలూరిపేట బైపాస్‌ను ప్రారంభిస్తారు.
Similar News
News January 21, 2025
అర్జీలపై అధికారులు దృష్టి పెట్టాలి: ప్రకాశం కలెక్టర్
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే ఆర్జీలపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి సత్వరమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. సోమవారం ఒంగోలు కలెక్టరేట్‌లో మీ కోసం కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో 302 అర్జీలు వచ్చాయన్నారు. వీటిని ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సత్వరం పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ద చూపాలని కలెక్టర్ ఆదేశించారు.
News January 20, 2025
ప్రకాశం: పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమానికి 81 ఫిర్యాదులు
ప్రజా ఫిర్యాదులను పరిష్కారించుటకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ దామోదర్, పోలీస్ అధికారులు ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 81 ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. అనంతరం ఫిర్యాదు దారులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే చట్ట ప్రకారం విచారణ జరిపి బాధితులకు త్వరితగతిన న్యాయం అందించేలా చూడాలని ఆదేశించారు.
News January 20, 2025
త్రిపురాంతకం: బొలెరో బోల్తా.. 10 మంది కూలీలకు గాయాలు
త్రిపురాంతకం మండలం దీవెపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనం టైర్ పగిలి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలయ్యాయి. స్థానికులు వారిని 108 వాహనంలో త్రిపురాంతకం వైద్యశాలకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.