News September 20, 2024

ప్రకాశం జిల్లాలో నేడు CM పర్యటన

image

ప్రకాశం జిల్లా నాగులుప్పపాడు మండలం మద్దిరాలపాడులో నేడు CM చంద్రబాబు పర్యటించనున్నారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పాలన పూర్తయిన సందర్భంగా.. ఇది మంచి ప్రభుత్వం పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మధ్యాహ్యం 2 గంటలకు మద్దిపాడు చేరుకుని సాయంత్రం 5 గంటల వరకు మీటింగ్‌లో పాల్గొంటారు. అధికారులు పర్యటనా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

Similar News

News October 7, 2024

ఒంగోలు పోలీసులు కొట్టడం వల్లే రాజశేఖర్ చనిపోయారు: నాగేంద్ర

image

ఒంగోలు టూ టౌన్ పోలీసులు కొట్టి అవమానించడం వల్లనే పరుచూరి రాజశేఖర్ పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నీలం నాగేంద్ర ఆరోపించారు. ఆదివారం ఒంగోలులోని GGHలో రాజశేఖర్ మృతదేహాన్ని పరిశీలించిన ఆయన ఘటనపై మెజిస్టీరియల్ విచారణ జరగాలని.. మృతుడి కుటుంబానికి 25 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

News October 6, 2024

ఒంగోలు: డిగ్రీ స్పాట్‌ అడ్మిషన్ల నోటిఫికేషన్‌ విడుదల

image

డిగ్రీ కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరానికి స్పాట్‌ అడ్మిషన్లకు నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు ఒంగోలులోని డీఎస్‌ ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్‌ కళ్యాణి ఒక ప్రకటనలో తెలిపారు. తమ కళాశాలలో ప్రవేశాలకు ఆసక్తి కలిగిన విద్యార్థులు స్పాట్‌ అడ్మిషన్‌ కోసం ఈనెల 9లోగా కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇప్పటిదాకా డిగ్రీ ప్రవేశాలు పొందని ఇంటర్ విద్యార్థులు ఈఅవకాశాన్ని వినియోగించు కోవాలన్నారు.

News October 6, 2024

పొదిలి: ఉప సర్పంచ్‌పై రాడ్లతో దాడి

image

ఉప సర్పంచ్‌పై రాళ్ల దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన పొదిలి మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు వివరాల ప్రకారం.. పొదిలి మండలం మాదిరెడ్డిపాలెం ఉపసర్పంచ్ ఓంకార్‌ని శనివారం అర్ధరాత్రి సమయంలో, తన ఇంటికి వెళ్ళే క్రమంలో గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు కాపుకాసి రాడ్లుతో తలమీద దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దాడికి గల పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.