News August 21, 2024
ప్రకాశం జిల్లాలో పలువురు SIల బదిలీ

ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ పలువురు ఎస్ఐలను బదిలీ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీలో భాగంగా అర్ధవీడు నూతన ఎస్సైగా బి సుదర్శన్ యాదవ్ నియమితులయ్యారు. అలానే కురిచేడు ఎస్సై శ్రీకాంత్ నాగులుప్పలపాడుకు, ఎస్సై మహేశ్ వీఆర్ నుంచి దోర్నాలకు, వెలిగండ్ల ఎస్సై శివ కురిచేడుకు బదిలీ అయ్యారు.
Similar News
News November 29, 2025
ప్రకాశం: ‘అభ్యంతరాలు ఉంటే తెలపండి’

ప్రకాశం జిల్లాలో కలవనున్న కందుకూరు, అద్దంకి డివిజన్లకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లో తెలపాలని కలెక్టర్ కార్యాలయం శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. కందుకూరు రెవిన్యూ డివిజన్ పరిధిలోని 5 మండలాలను, కనిగిరి రెవిన్యూ డివిజన్ పరిధిలోని 2 మండలాలను కందుకూరులోకి కలుపుతూ.. అలాగే కొత్తగా అద్దంకి రెవెన్యూ డివిజన్లోని 10 మండలాలను ప్రకాశం జిల్లాలో కలుపుతున్నామని, దీనికై సూచనలు ఇవ్వాలన్నారు.

అదనపు డబ్బులు వసూలు చేస్తే చర్యలు: JC

కేంద్ర ప్రభుత్వం ఉజ్వల పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్ లేని పేదలకు గ్యాస్ కనెక్షన్, మొదటి గ్యాస్ సిలిండర్ను సైతం ఉచితంగా అందజేస్తామని JC గోపాలకృష్ణ అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం దీపం కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో మాట్లాడుతూ.. గ్యాస్ డెలివరీ చేసే సమయంలో అదనపు డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, బాధ్యులైనవారిపై చర్యలు తీసుకుంటామన్నారు.