News October 1, 2024
ప్రకాశం జిల్లాలో పింఛన్ల పంపిణీకి రూ.122.64 కోట్లు మంజూరు
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద అక్టోబర్ నెలకు సంబంధించి ప్రకాశం జిల్లాలోని 2,88,144 మంది లబ్ధిదారులకు రూ.122.64 కోట్లు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ అన్సారియా తెలిపారు. 2వ తేదీ గాంధీజయంతి కావడంతో 1న పింఛన్లు పంపిణీ చేయాలని సిబ్బందికి సూచించారు .ఈ మేరకు మంగళవారం జిల్లా వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ పూర్తి చేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. అధికారులు బ్యాంకుల నుంచి నగదు విత్ డ్రా చేసుకోవాలన్నారు.
Similar News
News October 14, 2024
ప్రకాశం జిల్లాలో రేపు విద్యాసంస్థలకు సెలవు
భారీ వర్షాల దృష్ట్యా మంగళవారం కూడా ప్రకాశం జిల్లాలోని అన్ని అంగన్వాడీలు, పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. ఏవైనా సంక్షేమ హాస్టళ్లు ప్రమాదకర స్థితిలో ఉంటే వాటిలో ఆశ్రయం పొందుతున్న విద్యార్థులను తక్షణమే ఇతర హాస్టల్లోకి, సమీపంలోని సురక్షిత భవనాల్లోకి తరలించాలని అధికారులకు కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
News October 14, 2024
ప్రకాశం జిల్లాలో మద్యం లాటరీ ప్రక్రియ ప్రారంభం
ప్రకాశం జిల్లాలో మద్యం షాపుల కేటాయింపు కోసం లాటరీ ప్రక్రియ ప్రారంభమైంది. ఒంగోలులోని అంబేడ్కర్ భవనంలో 2 కౌంటర్ల ద్వారా ఈ ప్రక్రియ చేపట్టారు. కలెక్టర్ తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల కృష్ణ స్వయంగా లాటరీ తీస్తున్నారు. జిల్లాలోని 171 మద్యం షాపుల కోసం మొత్తం 3466 దరఖాస్తులు దాఖలయ్యాయి. అత్యంత పారదర్శకంగా అర్జీదారుల సమక్షంలో అధికారులు లాటరీ తీస్తున్నారు.
News October 14, 2024
ప్రకాశం: కారు బోల్తా.. ఇద్దరు మృతి
ఉమ్మడి ప్రకాశం జిల్లా వలేటివారిపాలెం మండలంలో విషాదం చోటుచేసుకుంది. నలదలపూరులో జరిగిన వివాహానికి కొందరు హాజరయ్యారు. తిరిగి కారులో పోకూరుకు బయల్దేరారు. కొండారెడ్డిపాలెం వద్ద సోమవారం తెల్లవారుజామున కారు బోల్తాకొట్టింది. సామ్రాజ్యం(65), సులోచన(55) ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారిని ఒంగోలు రిమ్స్‌కు, మిగిలిన వారిని కందుకూరు ఆసుపత్రికి తరలించారు.