News January 11, 2025

ప్రకాశం జిల్లాలో పెరుగుతున్న జ్వరాలు

image

ప్రకాశం జిల్లాలో మూడు నెలలుగా జ్వరం తాండవిస్తోంది. ప్రస్తుతం మంచు ఎక్కువగా ఉండటంతో చాలా మంది జలుబు, దగ్గుతో ఇబ్బంది పడుతున్నారు. 10 రోజుల వ్యవధిలోనే జిల్లాలో వందల సంఖ్యలో విష జ్వరాల కేసులు నమోదైనట్లు సమాచారం. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. 2,3 రోజులకు మించి జ్వరం ఉంటే ఆసుపత్రికి వెళ్లాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

Similar News

News November 24, 2025

రాచర్ల: పొలంలో నీళ్లు పెడుతుండగా.. కరెంట్ షాక్‌కి గురై..

image

రాచర్ల మండలం ఆకవీడుకు చెందిన చిట్టిబాబు చిన్న కుమారుడు రాజేశ్ విద్యుత్ షాక్‌కు గురై ఆదివారం మృతి చెందారు. మొక్కజొన్న పొలంలో నీళ్లు పెడుతుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌కు గురై మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో కుటుంబం శోకసముద్రంలో మునిగింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.

News November 24, 2025

ప్రకాశం జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీగా బాపట్ల ఎస్పీ

image

ప్రకాశం జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీగా బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వర్ నియమించబడ్డారు. ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు డిసెంబర్ రెండు వరకు సెలవుల్లో ఉండడంతో, ప్రభుత్వం ఈ మేరకు బాపట్ల ఎస్పీని ఇన్‌ఛార్జ్‌గా నియమించింది. దీనితో జిల్లా బాధ్యతలను బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వర్ చేపట్టారు. డిసెంబర్ మూడో తేదీన ఎస్పీ హర్షవర్ధన్ రాజు మళ్లీ విధుల్లో చేరనున్నారు.